ఆయనే ఇష్టం.. లైవ్‌లో కంటతడి పెట్టుకున్న అనుష్క! అవసరమైతే వదిలేస్తా..

కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న స్వీటీ అనుష్క.. ఇప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఏదో ఒక రూపంలో అనుష్కకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ లైవ్ షోలో ఆమె కంటతడి పెట్టుకోవడం, తనకు ఇష్టమైన వారి గురించి స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలేంటో చూద్దామా..

సూపర్‌గా ఎంట్రీ ఇచ్చి అరుంధతిగా సత్తా చాటుతూ..

సూపర్‌గా ఎంట్రీ ఇచ్చి అరుంధతిగా సత్తా చాటుతూ..

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'సూపర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ పట్టేస్తూ సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'అరుంధతి' సినిమాతో ఆమె సత్తా ఏంటో టాలీవుడ్ లోకానికి తెలిసింది. ఇక ఆ వెంటనే 'బాహుబలి' సిరీస్ ఆమెను వరల్డ్ స్టార్ చేసేసింది.

 సినిమాలకు బ్రేక్.. అందరూ అదే అనుకున్నారు కానీ!

సినిమాలకు బ్రేక్.. అందరూ అదే అనుకున్నారు కానీ!

వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా కీర్తించబడిన అనుష్క.. 'భాగమతి' మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దీంతో ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు ఊపందుకున్నాయి. అనుష్కకు సంబంధించి ఏ సందర్భం వచ్చినా ఆమె మ్యాటరే ముందు ప్రస్తావనకు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.

ఇంతలో అనుష్క నిశ్శబ్దం

ఇంతలో అనుష్క నిశ్శబ్దం

ఇంతలో 'నిశ్శబ్దం' అనే సినిమాతో తిరిగి సెట్స్‌పై చేరిన అనుష్క.. త్వర త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ చేపడుతోంది. ఇందులో భాగంగా పలు టీవీ షోస్ లో పాల్గొంటూ సందడి చేస్తున్న అనుష్క.. ఇటీవల జరిగిన ఓ షోలో తనకిష్టమైన డైరెక్టర్ గురించి చెబుతూ కంటతడి పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.

 ఇష్టమైన దర్శకుడు ఎవరంటే.. అనుష్క ఆన్సర్

ఇష్టమైన దర్శకుడు ఎవరంటే.. అనుష్క ఆన్సర్

ఓ గేమ్ షోలో పాల్గొన్న అనుష్కకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇష్టమైన దర్శకుడు ఎవరు అని అడగగా.. పూరి జగన్నాధ్ అని చెప్పిన అనుష్క, మరో డైరెక్టర్ కోడి రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. తనకు ఈ స్థాయిలో పేరు తీసుకొచ్చిన దర్శకుడు కోడి రామకృష్ణ గారే అని పేర్కొంది.

అరుంధతి అనుభవం.. అనుష్క కంటతడి

అరుంధతి అనుభవం.. అనుష్క కంటతడి

కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరుంధతి' సినిమా అనుభవాన్ని పంచుకున్న అనుష్క.. ఆ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టుకుంది. ''మిస్ యు కోడి రామకృష్ణ గారు'' అంటూ చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది స్వీటీ. ఆమెను అలా చూసిన ప్రేక్షకులు కోడి రామకృష్ణ గారంటే ఆమెకు ఎంత అభిమానముందో అర్థం చేసుకుంటున్నారు.

ప్రభాస్‌తో క్లోజ్.. కారణమిదే..

ప్రభాస్‌తో క్లోజ్.. కారణమిదే..

ఇకపోతే ప్రభాస్‌తో స్నేహం గురించి మరోసారి స్పందించిన అనుష్క.. అతని స్నేహం కోసం సినిమాలు కూడా వదిలేసేందుకు రెడీ అని చెప్పింది. గతంలో కూడా ప్రభాస్ వ్యక్తిత్వం, తన వ్యక్తిత్వం ఒకేలా ఉంటుందని.. అందుకే తాము క్లోజ్ తప్పితే ఎలాంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చింది స్వీటీ అనుష్క.

Recommended Video

Anushka Gets Emotional On The Sets, Reason Behind Anushka's Public Breakdown
నిశ్శబ్దం మూవీ

నిశ్శబ్దం మూవీ

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన 'నిశ్శబ్దం' (సైలెన్స్) సినిమాలో అనుష్కతో పాటు మాధవన్, షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో అనుష్క మూగమ్మాయిగా కనిపించనుండటం విశేషం. ఏప్రిల్ 2 న ఈ మూవీని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X