Womens Day గ్లామర్‌తో అదరగొట్టిన మిస్ శెట్టి.. అనుష్కశెట్టి లుక్ వైరల్
బాహుబలి, భాగమతి లాంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా మారిన స్వీటి అనుష్కశెట్టి ఆచితూచీ సినిమాలు చేస్తున్నారు. కంటెంట్‌కు ప్రధాన్యాం ఉన్న సినిమాలతో ప్రేక్షకులను ఆలరిస్తున్నారు. అయితే చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న అనుష్క శెట్టి తాజాగా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే చిత్రం ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను మహిళా దినోత్సవం రోజున ఆవిష్కరించారు.

మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి పోస్టర్‌లో అనుష్క చాలా అందంగా కనిపించింది. విదేశీ లొకేషన్‌లో బిజీ రోడ్డును దాటుతున్నట్టుగా ఉంది. అందంగా నవ్వుతూ అనుష్క గ్లామర్ పంట పండించింది. లాంగ్ కోటు ధరించిన ఆమె ట్రెడిషినల్‌గా కనిపించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతున్నది. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి సిద్ధు పాత్రలో స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క అన్విత రవళిశెట్టి అనే చెఫ్ పాత్రలో నటించారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫస్ట్ లుక్‌తో అంచనాలు పెంచింది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయబోతున్నారు.
నటీనటులు: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి తదితరులు
సంగీతం: రధన్
సినిమాటోగ్రఫి: నీరవ్ షా
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
పిఆర్వో: జీఎస్కె మీడియా
నిర్మాణ సంస్థ: యూవీ క్రియేషన్స్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్,
రచన, దర్శకత్వంః పీ మహేష్ కుమార్
బ్యానర్: యూవీ క్రియేషన్స్


Click it and Unblock the Notifications











