అనుష్క సర్‌ప్రైజ్: 'నిశ్శబ్దం' ఫస్ట్‌లుక్.. అనుష్క క్యారెక్టర్ ఇదే
స్టార్ హీరోయిన్ అనుష్క సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది ప్రేక్షకలోకం. బాహుబలి సిరీస్ ద్వారా తన పాపులారిటీని మరింత పెంచుకున్న స్వీటీ.. ఆ తర్వాత 'భాగమతి' సినిమాతో అలరించింది. ఇక ఈ సినిమా తర్వాత అనుష్క కాస్త గ్యాప్ తీసుకున్న ఈమె తిరిగి ఇప్పుడు 'నిశ్శబ్దం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మేరకు ఇప్పటి నుంచే చిత్ర ప్రమోషన్స్ మొదలు పెట్టారు యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా తాజాగా 'నిశ్శబ్దం' ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ లో అనుష్క వైట్ బోర్డుపై పెయింటింగ్ చేస్తూ కనిపించింది. లుక్ పరంగా మరింత గ్లామర్‌గా తయారైంది అనుష్క. ఇక ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరు సాక్షి అని, ఆమె ఒక మౌన కళాకారిణి అని పోస్టర్ ద్వారా తెలిపింది చిత్రయూనిట్.

ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా 'నిశ్శబ్దం' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌కి చెందిన పలువురు నటీనటులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది. అనుష్క శెట్టి, ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, ఇంగ్లీషు, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్ధాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











