క్రేజీగా అనుష్కశెట్టి నిశ్శబ్దం ప్రీ టీజర్.. ఇక టీజర్ రిలీజ్ ఎప్పుడంటే.. '
బాహుబలి, భాగమతి చిత్రాల తర్వాత అనుష్క శెట్టి మరోసారి ఓ పవర్‌ఫుల్, ఫీల్‌గుడ్ పాత్రలో ప్రేక్షకు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఆమె నటించిన నిశ్శబ్దం చిత్రం అమెరికాలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేషన్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. విలక్షణ నటుడు మాధవన్, హాలీవుడ్ చిత్రాల్లో నటించిన కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌్సన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
ఇక నిశ్శబ్దం సినిమాకు సంబంధించిన టీజర్‌ను నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. ప్రీ టీజర్ రిలీజ్‌కు సంబంధించిన వీడియోలోని మ్యూజిక్ చాలా బాగుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ టీజర్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌గా, అంతర్జాతీయ ప్రమాణాలకు సమానమైన నిర్మాణ విలువలతో రూపొందించినట్టు సమాచారం. ఈ టీజర్ రిలీజ్‌కు సంబంధించిన విషయాలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సిఈవో విశ్వప్రసాద్ వెల్లడించారు.

ఈ సందర్భంగా విశ్వప్రసాద్ మాట్లాడుతూ.... నిశ్శబ్దం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకొంటుంది. ఓ వినూత్నమైన సినిమా చూసామనే ఫీలింగ్ కలిగిస్తుంది. మాధవన్, అనుష్క, మైఖేల్ మ్యాడ్సన్ నటనకు ప్రేక్షకులు స్టాండింగ్ వోవేషన్ ఇవ్వడం గ్యారెంటీ. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సీయోటెల్ హెడ్ క్వార్టర్స్ గా స్ధాపించిన ప్రముఖ నిర్మాణ సంస్థ. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, కో - ప్రొడక్షన్, ఈవెంట్స్ లో స్పెషలైజేషన్ తో ముందుకు దూసుకెళుతుంది. అంతర్జాతీయ స్ధాయి కలిగిన ఫ్రొఫెషనల్ టీమ్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉనికి కలిగి ఉంది. ఈ సంస్థ టాలీవుడ్, కోలీవుడ్,శాండిల్ వుడ్, బాలీవుడ్ మరియు హాలీవుడ్ ఇండస్ట్రీలలో సినిమాలు నిర్మిస్తోంది.
సాంకేతిక నిపుణులు వివరాలు
డివోపి: షానియల్ కుమార్ డియో,
ప్రొడక్షన్ డిజైనర్: నాథన్ బేక్స్,
మ్యూజిక్: గోపీ సుందర్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మైఖేల్ మ్యాడసన్, దేవ్ పిన్న్,
లైన్ ప్రొడ్యూసర్: పత్స నాగరాజ్, దుజాత ప్రభు,
కాస్టింగ్ డైరెక్టర్: రేనీ గార్సియ,
ఎంటర్ టైన్మెంట్ అటర్నీ: బ్రాండన్ బ్లేక్,
లోకేషన్ సర్వీసస్: నికోలే మిల్ స్టీడ్,
ఎస్ఎజి కన్సల్‌టెంట్: పాల్ రాయ్,
కో - ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల


Click it and Unblock the Notifications











