twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. 'నిశ్శబ్దం'గా అనుష్క లుక్ వచ్చేస్తోంది

    |

    స్టార్ హీరోయిన్ అనుష్క సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది ప్రేక్షకలోకం. బాహుబలి సిరీస్ ద్వారా తన పాపులారిటీని మరింత పెంచుకున్న స్వీటీ ఆ తర్వాత భాగమతి సినిమాతో అలరించింది. ఇక ఈ సినిమా తర్వాత అనుష్క కాస్త గ్యాప్ తీసుకోవడం, దీంతో ఆమె పెళ్లి చేసుకోబోతోందంటూ టాక్ వినిపించడంతో తరచూ వార్తల్లో నిలిచింది ఈ జేజమ్మ. కానీ అందరికీ షాకిస్తూ 'నిశ్శబ్దం' అనే సినిమాతో పలు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది అనుష్క.

    ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా 'నిశ్శబ్దం' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌కి చెందిన పలువురు న‌టీన‌టుల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ జరుపుకుంటోంది.

    Anushka Shettys Silence First look poster released on..

    ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాలకు అనుష్క ఫస్ట్‌లుక్ విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం అఫీషియల్ ప్రకటన జారీ చేసింది చిత్రయూనిట్.

    కోన వెంక‌ట్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల్లో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    After long gap of Bhagamathi Anushka starts a new movie Silence. This movie shooting started in America. On September 11th this movie first look poster will be release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X