ప్రభాస్ బాటలోనే అనుష్క.. భారీ రేంజ్‌లో
టాలీవుడ్ లో యంగ్ హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలకు ఉన్న క్రేజ్ ప్రత్యేకమైంది. సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోహీరోయిన్లు గా ఎదిగిన వీళ్ళు 'బాహుబలి' సినిమాలో కలిసి నటించారు. అంచనాలను మించి రెస్పాన్స్ తెచ్చుకున్న బాహుబలి సిరీస్ ప్రభాస్, అనుష్కల క్రేజ్‌ని ఎల్లలు దాటించింది. ఈ సినిమాతో వరల్డ్ స్టార్ అయిపోయారు ఇద్దరూ. దీంతో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ప్రభాస్, అనుష్క క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. క్రేజీ జోడీగా ప్రేక్షకుల మదిలో స్థిరపడిపోయారు ప్రభాస్- అనుష్క.
అయితే బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ క్యాచ్ చేసుకునేలా సాహో లాంటి భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు ప్రభాస్. భారీ బడ్జెట్ తో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మరోవైపు అనుష్క కూడా భారీ సినిమాకు కమిటై శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేసుకుంటోంది.

భాగమతి సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో సైలెన్స్ అనే సినిమా చేస్తోంది. థ్రిల్లింగ్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో నిశ్శబ్దం పేరుతో తమిళ, హిందీ భాషల్లో సైలెన్స్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం సరికొత్తగా మేకోవర్ అయిన అనుష్క ఇప్పటికే 50 శాతం షూటింగ్ ఫినిష్ చేసింది. మరి కొద్ది రోజుల్లో మిగితా పార్టీ షూటింగ్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రభాస్ సాహో లాగే అన్ని భాషల్లో ఒకేసారి భారీ స్థాయిలో అనుష్క సైలెన్స్ సినిమాను రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. అంటే 'బాహుబలి' లో ఇద్దరూ కలిసి సృష్టించిన సెన్సేషన్ ఇప్పుడూ విడివిడిగా క్రియేట్ చేయనున్నారన్నమాట.


Click it and Unblock the Notifications











