అంధకారంలో అనుష్క.. వైరల్ అవుతున్న పిక్
బాహుబలి సినిమాతో ఎల్లలు దాటే క్రేజ్ కొట్టేసింది అనుష్క. దక్షిణాది హీరోయిన్లలోకెల్లా బిగ్గెస్ట్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఈమె గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. చివరగా భాగమతి రూపంలో వెండితెర దర్శనమిచ్చిన స్వీటీ.. ఆ సినిమా ద్వారా అభిమానుల రేంజ్ అందుకోలేక పోయింది. అయితే కొంత గ్యాప్ తీసుకున్న అనుష్క ఇటీవలే సైలెన్స్ అనే సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో రూపొందుతోన్న సైలెన్స్ చిత్రానికి తెలుగులో నిశ్శబ్దం, ఇంగ్లీష్‌లో సైలెన్స్ అనే టైటిల్స్ ఫిక్స్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తుండగా అంజలి, అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే కూడా అనుష్క తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. గోపిసుందర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఈ చిత్రం నుంచి అనుష్క లుక్ ఒకటి రివీల్ చేసింది. కానీ ఈ పిక్ లో అనుష్క కనిపించీ కనిపించనట్లుగా దర్శనమిచ్చింది. అంధకారంలో అనుష్కను ప్రేక్షకుల ముందుంచారు. చేతిలో ఏదో పుస్తకం పట్టుకొని రాస్తున్నట్లుగా అనుష్క ఈ లుక్ లో అనుష్క కనిపిస్తోంది.

కాగా ఈ పోస్టర్ విడుదల చేస్తూ.. అనుష్క త్వరలో స్పాట్ లైట్ లోకి వస్తుందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. వెండితెరపై అనుష్కను చూసి చాలా కాలం అవుతున్న కారణంగా సైలెన్స్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాలోనూ అనుష్క నటిస్తోంది. అక్టోబర్ నెలలో సైరా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది అనుష్క.


Click it and Unblock the Notifications











