పీడకలలతో అనుష్క.. ‘నిశ్శబ్ధం’గా భరిస్తూ! అంతా అనుమానితులే.. వైరల్ వీడియో
స్టార్ హీరోయిన్ అనుష్క సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది ప్రేక్షకలోకం. 'బాహుబలి' సిరీస్ ద్వారా తన పాపులారిటీని మరింత పెంచుకున్న స్వీటీ.. ఆ తర్వాత 'భాగమతి' సినిమాతో అలరించింది. ఇక ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈమె తిరిగి ఇప్పుడు 'నిశ్శబ్దం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నిశ్శబ్దంగా అనుష్క సర్‌ప్రైజ్
గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజా అప్డేట్ ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసింది. ఇప్పటికే నిశ్శబ్దం నుంచి అనుష్క, మాధవన్, అంజలి లుక్స్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేసిన చిత్రయూనిట్.. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసి ఆకట్టుకుంది. కొద్ది సేపటి క్రిందే విదులైన ఈ టీజర్ ఆన్ లైన్ హంగామా చేసేస్తోంది.

అనుష్క బర్త్ డే స్పెషల్.. టీజర్ అదిరింది
నవంబర్ 8వ తేదీన అనుష్క పుట్టిన రోజును పురస్కరించుకొని నిశ్శబ్ధం టీజర్ విడుదల చేశారు మేకర్స్. కేవలం ఒక నిమిషం 14 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ టీజర్ అనుష్క అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగులో ‘నిశ్శబ్ధం' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ఇతర భాషల్లో ‘సైలెన్స్' అనే పేరుతో రూపొందుతోంది.
అనుష్కకు పీడకలల బాధ.. యాక్సిడెంట్ కావడంతో
ఈ టీజర్‌లో చూపించిన అన్ని సీన్స్ బాగా అట్రాక్ట్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. అనుష్క వెకేషన్ వెళ్లడం, ఆ తర్వాత ఆమెకు ఏదో యాక్సిడెంట్ కావడం చూపించి ఆసక్తి రేపారు మేకర్స్. అనుష్కను పీడకలలు వెంటాడటం, అలాగే అన్ని కారెక్టర్స్ అనుమానితులు గానే ఉండటం ఈ సినిమాలో స్పెషల్ అని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. పైగా ఇందులో అనుష్క డెఫ్ అండ్ డమ్ క్యారెక్టర్ చేస్తుండటం భారీ అంచనాలకు నాంది పలికింది.

నిశ్శబ్దం మూవీ డీటెయిల్స్
ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా 'నిశ్శబ్దం' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌కి చెందిన పలువురు నటీనటులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది. అనుష్క శెట్టి, ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











