ప్రభాస్‌తో అర్థరాత్రి.. ఇద్దరికీ పెళ్లి కాలేదు కాబట్టే!: అసలు విషయం బయటపెట్టిన అనుష్క

సిల్వర్ స్క్రీన్ జోడీల్లో ప్రభాస్- అనుష్క జోడీకి ఉన్న ఆ క్రేజే వేరు. బిల్లా, మిర్చి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిలో పడిన ఈ బ్యాచిలర్ జంట.. ఆ తర్వాత వచ్చిన బాహుబలి సిరీస్‌తో ప్రతీ వ్యక్తిలోనూ అనుమానాలకు కారణమైంది. వెండితెరపై ఈ జోడీ స్ట్రాంగ్ కెమిస్ట్రీ చూశాక వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని పెద్ద ఎత్తున పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై స్పందించిన అనుష్క.. తనకు ప్రభాస్‌తో ఉన్న చనువు ఎలాంటిదో చెప్పుకొచ్చింది. వివరాల్లోకి పోతే..

 సూపర్ జోడీ.. ఎక్కడికెళ్లినా అదే టాపిక్

సూపర్ జోడీ.. ఎక్కడికెళ్లినా అదే టాపిక్

టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్, హీరోయిన్లలో అనుష్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్. పైగా టాప్ స్టార్స్. అంతకుమించి సూపర్ హిట్ జోడీ. ఈ అంశాలే ప్రభాస్- అనుష్క డేటింగ్‌లో ఉన్నారు. పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే వార్తలకు బలాన్నిచ్చాయి. ఎప్పటికప్పుడు ఇటు అనుష్క, అటు ప్రభాస్ తమ రిలేషన్ పై క్లారిటీ ఇస్తున్నా కూడా పుకార్ల షికార్లు మాత్రం ఆగడం లేదు.

 వెంటాడుతున్న ప్రశ్నల దాడి..

వెంటాడుతున్న ప్రశ్నల దాడి..

ఈ క్రమంలో తమ తమ సినిమాల ప్రమోషన్స్ నిమిత్తమై పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ప్రభాస్‌, అనుష్కలకు వీళ్లిద్దరి రిలేషన్ ప్రశ్న అనేది కామన్ అయింది. అనుష్కతో మీ రిలేషన్‌ ఏంటి? అని ప్రభాస్‌పై, ప్రభాస్‌తో మీ రిలేషన్ ఏంటి? అని అనుష్కపై ప్రశ్నల దాడి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి అనుష్క రియాక్ట్ అయింది.

 3AM ఫ్రెండ్.. ఎంత అర్థరాత్రి అయినా..

3AM ఫ్రెండ్.. ఎంత అర్థరాత్రి అయినా..

ప్రభాస్ తనకు 3AM ఫ్రెండ్ అని చెప్పింది అనుష్క. అతనితో ఎంత అర్థరాత్రి అయినా ఫోన్‌లో మాట్లాడేంత స్నేహబంధం తమ మధ్య ఉందని పేర్కొంది. ఇద్దరికీ ఇంకా పెళ్లి కాకపోవడం, కలిసి ఎక్కువ సినిమాలు చేయడంవల్లే మా మధ్య ప్రేమ ఉందని వదంతులు పుట్టుకొచ్చాయని చెప్పిన ఆమె.. ఇలాంటి వదంతులు కొన్నిసార్లు ఇబ్బందులు కూడా తెస్తాయని చెప్పింది స్వీటీ.

 మా మనస్తత్వం అలాంటిది.. అందుకే!!

మా మనస్తత్వం అలాంటిది.. అందుకే!!

ఒకవేళ మా మధ్య ఏమైనా ఉంటే ఇప్పటికే ఎప్పుడో రివీల్ చేసే వాళ్లమని, మాది భావోద్వేగాలను దాచుకునే మనస్తత్వం కాదని తెలిపింది అనుష్క. ప్రభాస్ వ్యక్తిత్వం, తన వ్యక్తిత్వం ఒకేలా ఉంటుందని, అందుకే తాము క్లోజ్ తప్పితే ఎలాంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చింది స్వీటీ అనుష్క.

మేమన్నా ఇంట్లో దాక్కున్నామా?

మేమన్నా ఇంట్లో దాక్కున్నామా?

ఇకపోతే గతంలో ఇదే విషయమై స్పందించిన ప్రభాస్.. ''అనుష్క నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. అనుష్క నేను ప్రేమలో ఉన్నామని మీరు అంటున్నదే నిజమైతే గత రెండేళ్లుగా మేం ఎక్కడైనా కలిసి కనిపించామా? మేమన్నా ఇంట్లో దాక్కున్నామా?'' అని చెప్పారు.

Recommended Video

Prabhas 21 Movie Update | Prabhas 21 Movie Concept
ఈ సారి అనుష్కతో డైరెక్ట్‌గా చెప్పేస్తా

ఈ సారి అనుష్కతో డైరెక్ట్‌గా చెప్పేస్తా

ఇక ఇలాంటి రూమర్స్‌కి తెరపడాలంటే.. ముందు అనుష్కనో లేక నేనో పెళ్లి చేసుకోవాల్సిందే. అప్పటిదాకా ఈ సమస్య పోయేలా అనిపించడం లేదు. ఈసారి అనుష్క కలిసినప్పుడు త్వరగా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమని డైరెక్ట్‌గా చెప్పేస్తా.. అప్పుడైతే గానీ మీరు ఈ ప్రశ్నలు ఆపేలా లేరు అన్నారు ప్రభాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X