Happy Birthday Prabhas: ప్రభాస్ విషయంలో అలా జరగాలని అనుష్క కోరిక.. స్పెషల్ విషెస్

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేడు 42 వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా చిత్ర పరిశ్రమలో స్టార్ సెలబ్రిటీ లో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అభిమానులు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అంటూ ప్రత్యేకంగా ఒక ట్యాగ్ ను వైరల్ చేశారు. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా రెబల్ స్టార్ కు స్పెషల్ విషెస్ అందుతున్నాయి. ఇక ప్రభాస్ కు మంచి స్నేహితురాలు అయినటువంటి అనుష్క కూడా తన ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసింది. ఆమె సోషల్ మీడియాలో వేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

 అందుకే డార్లింగ్ అంటారు

అందుకే డార్లింగ్ అంటారు

రెబల్ స్టార్ ప్రభాస్ తన స్టార్ హోదాను ఎంత పెంచుకున్నప్పటికి కూడా మొదటి నుంచి తనకు ఎంతో సన్నిహితంగా ఉన్న వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ దేశ వ్యాప్తంగా అత్యధిక మార్కెట్ ఉన్న హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే అయినప్పటికీ కూడా పర్సనల్ లైఫ్ లో మాత్రం అందరితో సమానంగా నార్మల్ గా ఉంటాడు. సెలబ్రెటీలతో పాటు అభిమానులు కూడా ప్రభాస్ ని డార్లింగ్ అని పిలుచుకుంటారు.

పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చినప్పటికీ

పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చినప్పటికీ

ఇక ప్రభాస్ తో ఎంతో సన్నిహితంగా ఉండే హీరోయిన్లలో అనుష్క శెట్టి మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పవచ్చు. మొదటిసారి బిల్లా సినిమా తో కలిసి పని చేసిన ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. అయితే మధ్యలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ప్రభాస్ అనుష్క ఇద్దరూ కూడా అందులో నిజం లేదని చాలాసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా రూమర్స్ ఏమాత్రం తగ్గలేదు. మిర్చి, బాహుబలి సినిమాలతో వీరి స్నేహం మరింత బలపడింది.

అనుష్క స్పెషల్ విషెస్

ఇక నేడు ప్రభాస్ 42వ పుట్టినరోజు సందర్భంగా అనుష్క శెట్టి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా తన విషెస్ అందించింది. 'పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు జీవితంలో అన్ని విషయంలో మంచి జరగాలని కోరుకుంటున్నాను. మరియు మీ కథలన్నీ అనేక హృదయాలకు చేరువ కావాలని కోరుకుంటున్నాను. అలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకుంటున్నట్లు వివరణ ఇస్తూ..' తన హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలను అందించింది.

యూవీ క్రియేషన్స్ లో అనుష్క సినిమా

యూవీ క్రియేషన్స్ లో అనుష్క సినిమా

ఇద్దరూ కూడా బాహుబలి సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. మళ్ళీ మరొకసారి వీరి కలయికలో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మరోవైపు అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. కానీ ఆ విషయంపై ఇంతవరకు అనుష్క ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆమె త్వరలోనే ఒక సినిమా స్టార్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అలాగే యు.వి.క్రియేషన్స్ లో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా కథ సరిగ్గా సెట్టవ్వక పోవడం వలన అనుష్క చేయలేక పోయింది. ప్రస్తుతం మరొక సినిమా కోసం వాళ్లు కథను వెతుకుతున్నట్లు సమాచారం. ఒకవేళ స్టోరీ సెట్టయితే ఇదే ఏడాది రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X