అనుష్క డేటింగ్ ఇష్యూ.. మరోసారి ఘాటుగా రియాక్ట్ అయిన స్వీటీ.. ఏకంగా ఆ మాటే అనేసింది!!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క పెళ్లి వార్తలు గత కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నాయి. ఆ వార్తలతోనే సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అతగాడు.. ఇతగాడు అంటూ అనుష్కను పెళ్లి చేసుకోబోయేవాడి గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇక అనుష్క- ప్రభాస్ మ్యాటర్ అయితే ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఓ కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి రూమర్స్‌పై మరోసారి నోరువిప్పిన అనుష్క ఘాటు వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి పోతే..

ప్రభాస్‌తో అనుష్క ప్రేమ, పెళ్లి..
ప్రభాస్‌తో పలు సినిమాల్లో నటించడం, బాహుబలి సినిమాతో ఇద్దరూ వరల్డ్ స్టార్స్‌గా ఎదగడం అంతకుమించి ఇద్దరూ బ్యాచిలర్స్ కావడంతో అందరి కళ్ళు ఈ జోడీ పైనే పడ్డాయి. ప్రభాస్‌తో అనుష్క ప్రేమ, పెళ్లి గురించి వచ్చినన్ని ఊహాగానాలు ఇప్పటిదాకా మరే ఇతర సెలబ్రిటీలపై రాలేదు. ఏ చిన్న సందర్భం దొరికినా ప్రభాస్- అనుష్క మ్యాటర్ మాత్రమే తీయడం పరిపాటిగా మారింది.

క్రికెటర్‌తో అనుష్క పెళ్లి.. డైరెక్టర్ కొడుకు మ్యాటర్
ప్రభాస్ తనకు స్నేహితుడు మాత్రమే అని అనుష్క పదే పదే క్లారిటీ ఇవ్వడంతో ఇక క్రికెటర్‌తో అనుష్క పెళ్లి అంటూ మరో రూమర్ తెరపైకి తెచ్చారు గాసిప్ రాయుళ్లు. దీనిపైనా అనుష్క స్పందించడంతో ఫేమస్ డైరెక్టర్ కొడుకుతో అనుష్క పెళ్లి ఫిక్సయిందని, త్వరలోనే ఆ ప్రకటన రానుందని టాక్ బయటకొచ్చింది.

ఫైర్ అయిన అనుష్క.. క్లారిటీ ఇచ్చేసింది
ఇలాంటి వార్తలన్నీ చూసిన అనుష్క.. ఈ రూమర్స్ పుట్టించే వారిపై ఫైర్ అయింది. తాను ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే చేసుకుంటానని, ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దంటూ క్లారిటీ ఇచ్చేసింది. అయినప్పటికీ అలాంటి రూమర్స్‌కి మాత్రం ఫుల్‌స్టాప్ పడటం లేదు.

వాళ్ళకీ అక్కా చెల్లెల్లు ఉంటారు కదా..
దీంతో తాజాగా మరోసారి అనుష్క ఘాటుగా రియాక్ట్ అయింది. ''నా మీద ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. సినిమా వాళ్లపై పుకార్లు రావడం సాధారణమే గానీ కొందరు శృతి మించుతున్నారు. ఏమీ లేకుండానే పుకార్లు పుట్టిస్తున్నారు. మేం కూడా వాళ్లలాగే మనుషులం అనే విషయాన్ని గుర్తించుకోవాలి. నాపై తప్పుడు వార్తలు రాసేవాళ్లకీ అక్కా చెల్లెల్లు ఉంటారు కదా. అనుకుని వాటి గురించి ఆలోచించడం మానేశా'' అని పేర్కొంది అనుష్క.
Recommended Video

అనుష్క సైలెన్స్
ఇకపోతే అనుష్క తాజా సినిమా నిశ్శబ్దం (సైలెన్స్) ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో అనుష్కతో పాటు మాధవన్, షాలిని పాండే, అంజలి, సుబ్బరాజు ముఖ్యపాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











