Ms Shetty Mr Polishetty twitter Review అనుష్క శెట్టి ఖాతో హిట్ పడిందా? నవీన్ పొలిశెట్టి మూవీ ఎలా ఉందంటేఝ?
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యువ హీరో నవీన్ పొలిశెట్టి కాంబినేషన్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Ms Shetty Mr Polishetty). ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు పీ అనే దర్శకుడు తెలుగు సినిమాకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్స్, ప్రమోషన్స్ ఆడియెన్స్‌లో అంచనాలు పెంచాయి. ఓ రేంజ్ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? నెటిజన్లు ఏమంటున్నారు అనే వివరాల్లోకి వెళితే..

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ చూశాను. ఫస్టాఫ్‌లో ఫన్ చాలా క్రేజీగా ఉంది. సెకండాఫ్ చాలా ఎమోషనల్ టచ్‌తో చాలా బాగుంది. యూవీ క్రియేషన్స్ పాటించిన నిర్మాణ విలువలు టాప్ లేపాయి. ఈ సినిమాలో అది ఇది అని కాదు.. ప్రతీ ఒక్కటి వర్కవుట్ అయింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ కామెడీ.. ప్రతీ సన్నివేశంలో పడిపడి నవ్వాల్సిందే. కామెడీతోపాటు ఎమోషనల్ సీన్లు కూడా బాగున్నాయి అని ఓ నెటిజన్ చాలా పెద్ద రివ్యూ రాశాడు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం మూవీ రిపోర్ట్ ఇది. సిద్దూ పొలిశెట్టి, అన్విత సీన్లు, నవీన్ కామెడీ టైమింగ్, డైలాగ్స్, గుడ్ ఎమోషన్స్ ఉన్నాయి అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ ఓవర్సీస్‌లో షోలు మొదలయ్యాయి. బ్లాక్ బస్టర్ రిపోర్టు వస్తున్నది. ఈ సినిమా అందరికీ నచ్చతుంది అని అనుష్క శెట్టి ఫ్యాన్స్ అకౌంట్ నుంచి కామెంట్ వినిపించింది.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ సూపర్‌గా ఉంది. నవీన్, అనుష్క శెట్టి మధ్య ఫన్నీ, ఎమోషనల్ సీన్లు, కాన్సెప్ట్ చాలా బాగుంది.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ న్యూ ఏజ్ లవ్ స్టోరి చాలా ఫ్రెష్‌గా ఉంది. ఎక్సలెంట్ అండ్ నీట్ కామెడీ. సినిమా మొత్తం ఎంగేజింగ్‌గా ఉంది. ఈ సినిమా ఎలా ఉందంటే.. క్రికెటర్ బాల్ హిట్ చేస్తే గ్రౌండ్ పడినంత ఇంపాక్ట్ ఉంది. నవీన్ పొలిశెట్టి నువ్వు సినిమా ఇండస్ట్రీకి జాతిరత్నాలు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
నవీన్ పొలిశెట్టి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అతడి గ్రేస్ ఫస్టాఫ్‌లో అతడి గ్రేస్ వల్లే సినిమా నిలబడింది. సినిమా మెల్లమెల్లగా ఆకట్టుకొంటూ అలా మనసులో నిలిచిపోతుంది అని ట్వీట్ చేశారు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చాలా స్లోగా స్టార్ట్ అయి.. నవీన్ ఎంట్రీ తర్వాత ఊపందుకొంటుంది. అతడి టైమింగ్, కామెడీతో సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. ఈ సినిమాలో వన్ లైనర్స్ బాగా వర్క్ అయ్యాయి అని నెటిజన్ కామెంట్ చేశాడు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఈ సీన్ తెర మీద బాగా పండింది. నవీన్ పొలిశెట్టి ఫెర్ఫార్మెన్స్‌తో దాడి చేశాడు. అనుష్క క్యారెక్టర్ కంపోజ్‌గా ఉంది. చిన్న చిన్న లోపాలు ఉన్నా.. మనుసును ఆకట్టుకొనేలా సినిమా ఉంది. సెకండాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ చూశాను. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. నవీన్ పొలిశెట్టికి బ్లాక్ బస్టర్. నవీన్ నేచురల్ రాక్ స్టార్,. ప్రతీ ఒక్కరిని డిజాపాయింట్ లేకుండా ఫుల్ ఫన్ ఇస్తాడు. క్లైమాక్స్ ఆకట్టుకొనేలా ఉంది అని ఓనెటిజన్ కామెంట్ చేశాడు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సూపర్‌గా ఉంది. ఫన్‌తో ఆకట్టుకొన్నాడు. చాలా సీన్లలో కామెడీ వర్కవుట్ అయింది. నవీన్ కామెడీ టైమింగ్ ఫెర్‌ఫెక్ట్‌గా ఉంది. అనుష్క శెట్టి చాలా బాగుంది. ఫస్టాఫ్ ఫన్, సెకండాఫ్ ఎమోషనల్‌గా ఉంది. స్టోరి పెద్దగా ఏమీ ఉండదు. కానీ కథ నడిపించిన విధానం బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











