అవును ప్రభాస్‌తో నా రిలేషన్ అదే.. అనుష్క దిమ్మతిరిగే కామెంట్స్.. సీన్ రివర్స్
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్ అనుష్క పెళ్లి వార్తలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అతగాడు.. ఇతగాడు అంటూ అనుష్కను పెళ్లి చేసుకోబోయేవాడి గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇక అనుష్క- ప్రభాస్ మ్యాటర్ అయితే ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఓ కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్‌తో రిలేషన్‌పై మరోసారి నోరువిప్పిన అనుష్క.. దిమ్మతిరిగే కామెంట్స్ చేసింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే! వివరాల్లోకి పోతే..

ప్రభాస్‌తో అనుష్క ప్రేమ, పెళ్లి..
ప్రభాస్‌తో పలు సినిమాల్లో నటించడం, బాహుబలి సినిమాతో ఇద్దరూ వరల్డ్ స్టార్స్‌గా ఎదగడం అంతకుమించి ఇద్దరూ బ్యాచిలర్స్ కావడంతో అందరి కళ్ళు ఈ జోడీ పైనే పడ్డాయి. ప్రభాస్‌తో అనుష్క ప్రేమ, పెళ్లి గురించి వచ్చినన్ని ఊహాగానాలు ఇప్పటిదాకా మరే ఇతర సెలబ్రిటీలపై రాలేదు. ఏ చిన్న సందర్భం దొరికినా ప్రభాస్- అనుష్క మ్యాటర్ మాత్రమే తీయడం పరిపాటిగా మారింది.

అనుష్క నిశ్శబ్దం
ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘నిశ్శబ్దం' సినిమాలో అనుష్క నటిస్తోంది. ఇందులో మాధవన్ హీరోగా నటిస్తుండగా.. అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాలతో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్‌తో రిలేషన్‌పై అనుష్క స్పందించింది.

ప్రభాస్ ఫోటో చూపించగానే అనుష్క రియాక్షన్
‘నిశ్శబ్దం' ప్రమోషన్స్‌లో భాగంగా క్యాష్ ప్రోగ్రామ్‌కు వచ్చింది అనుష్క. ఈ ప్రోగ్రాంలో యాంకర్ సుమ కూడా ప్రభాస్ గురించి ప్రశ్నించింది. ప్రభాస్ ఫోటో చూపించగానే నా కొడుకు అంటూ దిమ్మతిరిగే సమాధానమిచ్చింది అనుష్క. అరె! అదేంటి? అని సుమ ఆశ్చర్యపోగా.. అవును నా కొడుకే కదా అంటూ మళ్ళీ అదే మాట చెప్పింది స్వీటీ.

సుమ అడగడం.. అనుష్క కౌంటర్స్ వేయడం
మీ ఇద్దరికి చాలా పోలికలున్నాయి కదా అని సుమ మరో పంచ్ వేయగా.. కొడుకు కదా అందుకే అంటూ రిటర్న్ కౌంటర్ వేసింది అనుష్క. సరే, కొడుకు కాదు.. అమరేంద్ర బాహుబలి గురించి చెప్పండి అంటే అందుకే కదా ఈయన కొడుకు అయ్యాడు అంటూ మరో సెటైర్ వేసి అందరినీ ఆకట్టుకుంది అనుష్క.

ఎంత అర్థరాత్రి అయినా.. ఆ బంధం మా ఇద్దరిదీ!
అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తనకు 3AM ఫ్రెండ్ అని చెప్పింది అనుష్క. అతనితో ఎంత అర్థరాత్రి అయినా ఫోన్‌లో మాట్లాడేంత స్నేహబంధం తమ మధ్య ఉందని పేర్కొంది. ఇద్దరికీ ఇంకా పెళ్లి కాకపోవడం, కలిసి ఎక్కువ సినిమాలు చేయడంవల్లే మా మధ్య ప్రేమ ఉందని వదంతులు పుట్టుకొచ్చాయని ఆమె చెప్పింది.
Recommended Video

ఈ మీడియా దయవల్ల ఇప్పటికే..
తన ప్రేమ, పెళ్లికి సంబంధించిన రూమర్స్ రోజు రోజుకూ రెట్టింపవుతూ వస్తున్నాయని.. ఈ మీడియా దయవల్ల ఇప్పటికే తనకు ఎన్నోసార్లు పెళ్లై పోయిందని అనుష్క అంటోంది. తన పెళ్లి సంగతి తల్లిదండ్రులకే అప్పగించానని, వాళ్ళు ఎవర్ని పెళ్లి చేసుకోమంటే అతన్నే పెళ్లాడతానని.. దయచేసి ఈ రూమర్స్ ఆపేయండని కొద్దిరోజుల క్రితం అనుష్క తెలిపింది.


Click it and Unblock the Notifications











