For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బోల్డు బ్యూటీతో రవితేజ రొమాన్స్: సీసా పట్టుకుని మరీ రచ్చ చేస్తున్న మాస్ హీరో

  |

  చాలా కాలంగా వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు ఎదురవుతుండడంతో తెగ ఇబ్బందులు పడిన మాస్ మహారాజా రవితేజ.. గత ఏడాది ఆరంభంలో 'క్రాక్' వంటి భారీ హిట్‌ను అందుకుని మళ్లీ ట్రాకులోకి వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదే రీతిలో స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఇది అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమాను మొదలు పెట్టాడు. కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా ఈ చిత్రానికి బ్రేకులు పడిపోయాయి. దీంతో దీన్ని కొన్ని రోజుల పాటు పక్కన పెట్టేశాడీ సీనియర్ హీరో.

  దీప్తి, షణ్ముఖ్ ఫ్యాన్స్‌కు శుభవార్త: సంచలన నిజాన్ని లీక్ చేసిన తండ్రి.. ఇద్దరూ మళ్లీ కలుస్తారా!

  'ఖిలాడీ' పట్టాలపై ఉన్న సమయంలోనే రవితేజ.. 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను కూడా మొదలు పెట్టేశాడు. శరత్ మందవ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ కూడా జరిగిపోయింది. సందేశాత్మక కథతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి తరచూ ఏదో ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వస్తోంది. దీంతో ఈ సినిమా నిత్యం వార్తల్లోనే ఉంటూ బజ్‌ను విపరీతంగా పెంచుకుంటోంది.

  Anveshi Jain Special Song in Ravi Tejas Ramarao On Duty Movie

  వరుసగా సినిమాల మీద సినిమాలు ప్రకటిస్తూ వస్తోన్న మాస్ హీరో రవితేజ.. వీలైనంత త్వరగా 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీని పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అందుకే కొద్ది రోజులుగా ఈ మూవీ కోసమే డేట్స్ కేటాయించాడు. ఇక, ఇప్పుడు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. 'సీసా' అంటూ సాగే ఈ పాటను సామ్ సీహెచ్ స్వరపరచగా.. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. అలాగే, ఈ పాటను టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రముఖ స్టూడియోలో ఈ పాటకు సంబంధించిన షూట్ జరుగుతోంది.

  బ్రాతో కనిపించి రెచ్చిపోయిన వర్షిణి: ఘాటు ఫోజులతో రచ్చ.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

  'రామారావు ఆన్ డ్యూటీ' మూవీలో ఉన్న స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ అన్వేషి జైన్ చిందులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మాస్ మహారాజా స్టెప్పులు కూడా అదిరిపోయేలా ఉంటాయని అంటున్నారు. ఇక, అన్వేషి జైన్ బోల్డు రోల్స్‌తో మంచి గుర్తింపును అందుకుంది. సంచలన వెబ్ సిరీస్ 'గంధీ బాత్' ద్వారా ఎనలేని గుర్తింపును అందుకున్న ఈ భామ.. 'హూ ఈజ్ యువర్ డాడీ', 'జీ ద ఫిల్మ్' వంటి చిత్రాల్లో నటించింది. దీంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ'తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతుంది.

  Anveshi Jain Special Song in Ravi Tejas Ramarao On Duty Movie

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో మాస్ మహారాజా రవితేజ బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై బజ్‌ను అమాంతం పెంచేశాయి. ఈ చిత్రంలో ఏకంగా ఇద్దరు హీరోయిన్లు దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  English summary
  Mass Maharaj Ravi Teja Doing Ramarao On Duty Under Sarath Mandava Direction. Anveshi Jain Special Song in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X