twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీ పెద్దగా కాదు బిడ్డగా వచ్చానన్న చిరు.. వెల్కమ్ ఆచార్య అంటూ జగన్ స్వాగతం

    |

    ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి భేటీ అంశం ఆసక్తికరంగా మారింది. ఆయన నుంచి ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఎట్టకేలకు జగన్ నుంచి పిలుపు రావడంతో ఆయన భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ ఫులేయించి జగన్ పలు కీలక అంశాలు పంచుకున్నాడు. ఆ వివరాలు

    ఇండస్ట్రీ బిడ్డగా తాడెపల్లికి

    ఇండస్ట్రీ బిడ్డగా తాడెపల్లికి

    ఏపీలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను చర్చించేందుకు సీఎం జగన్‌ ఆహ్వానం మేరకు ఇండస్ట్రీ బిడ్డగా తాడెపల్లికి వచ్చానని మెగాస్టార్‌ చిరంజీవి స్పష్టం చేశారు. ఈ రోజు(బుధవారం) హైదరాబాద్‌ బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ గంట, గంటన్నరలో అన్ని విషయాలు మీడియాకు వివరిస్తానని పేర్కొన్నారు.

    ఇతర సమస్యలు కూడా

    ఇతర సమస్యలు కూడా

    ఏపీలో సినిమా టికెట్ల విషయంపై సీఎం జగన్‌ తో చర్చించడానికి ఆయన అందిందింది. అయితే సినీ పరిశ్రమ, అధికార పార్టీకి చెందిన వారి మధ్య మధ్య టికెట్ల వివాదం రోజు రోజుకు ముదురుతున్న కారణంగా సీఎంతో భేటీ అంశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. టికెట్ల వ్యవహారం కాకుండా ఇతర సమస్యలు కూడా వారి మధ్య చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

    వెల్కం ఆచార్య

    వెల్కం ఆచార్య

    హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లిన చిరు నేరుగా తాడేపల్లిలో సీఎం క్యాంపాఫీస్‌కు వెళ్లారు. బయటకు వచ్చి సీఎం జగన్ మెగాస్టార్ చిరంజీవికి సాదరంగా స్వాగతం పలికారు. స్వాగతం ఆచార్య.. వెల్కం ఆచార్య అని జగన్ ఆహ్వానించారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి ఆ పిలుపులతో చిరునవ్వులు చిందించారని తెలుస్తోంది.

    అపాయింట్‌మెంట్ ఖరారై

    అపాయింట్‌మెంట్ ఖరారై

    ఇక జగన్‌కు శాలువా కప్పి సన్మానం చేసిన చిరంజీవి ఆయనకు పుష్పగుచ్చం కూడా ఇచ్చారు. ఇచ్చి సన్మానించారు. వారిద్దరి మధ్య లంచ్ భేటీలో కీలకమైన అంశాలు చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి సీఎంతో భేటీకి చిరంజీవి సహా సినీ పరిశ్రమ నుంచి చాలా మంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఆగస్టులోనే పేర్ని నాని చిరంజీవికి ఫోన్ చేసి సీఎం అపాయింట్‌మెంట్ ఖరారైనట్టు వెల్లడించారు. వచ్చి సీఎంను కలిసి ఇండస్ట్రీ సమస్యలు చెప్పుకోవాలని కూడా సూచించారు.

    పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం

    పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం

    ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఇచ్చిన అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయాలు వచ్చాయి. ఆ తర్వాత చిరంజీవే పలుమార్లు అపాయింట్‌మెంట్ అడిగారు కానీ స్పందన రాలేదు. దీంతో ఇండస్ట్రీ నుంచి కొందరు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం దానికి ప్రతిగా సినీ పరిశ్రమపై వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న కామెంట్లు కలకలం రేపుతున్నాయి. ఇక ఈరోజు భేటీకి సంబంధించి మరి కొద్దీ సేపట్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఖచ్చితంగా ఇండస్ట్రీకి అనుకూలంగా నిర్ణయం వస్తూండనై అందరూ ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

    English summary
    AP CM Ys Jagan welcomed Chiranjeevi saying welcome acharya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X