Pawan kalyan: నేను మీసం తిప్పుతే.. : అభిమానులకు పవన్ స్వీట్ వార్నింగ్..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ.. తనదైన మార్క్ పాలనను చేస్తున్నారు. తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తూనే చురకలు అంటించారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం బాగుజోల గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ పర్యటనలో బాగుజోలలో నూతన రహదారి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. రోడ్లు సరిగా లేక గిరిజనులు కష్టపడుతున్నారు. వారి బాధలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ బురదలో నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. అయితే.. ఈ సమయంలో పవన్ అభిమానులు, స్థానికులు పవన్ కళ్యాణ్ చుట్టుముట్టారు. పవన్ కళ్యాణ్ కు తమ అభిమానాన్ని చూపిస్తూ ఓజీ..ఓజీ అంటూ నినాదాలు చేశారు.

AP Deputy CM Power Star Pawan Kalyan Request To Fans At Parwathipuram Manyam

దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తనను పని చేసుకోనివ్వాలని.. ఇలా చుట్టుముడితే మీ సమస్యలు పరిష్కారం కావంటూ సూచించారు. ఈ సమయంలో పవన్ మాట్లాడుతూ.. "నా కోరిక ఒక్కటే. నా పని చేసుకోనివ్వండి. మీరందరూ నా మీద పడిపోతే ఎలా? రోడ్డు వేశారో..లేదో.. ఎలా చూడాలి. కనిపించడం లేదు. మీ అందరికీ దండం పెడతారా బాబూ.. నన్ను రోడ్డు చూడనివ్వండి. ఓజీ.. ఓజీ.. అంటే అరుస్తే ఎలా.. మరోవైపు సీఎం.. సీఎం అని అంటున్నారు. నేను డిప్యూటీ సీఎం అయ్యా.. అందుకు ఆనందించండి.యువత, ఆడపడుచులు, పెద్దలకు ఒకటే రిక్వెస్ట్.. నేను పని చేస్తేనే కదా.. మీ భవిష్యత్తుకు మంచింది. మీరంతా చుట్టుముట్టు ముడితే ఎలా.. నేను పనిచేయలేను కదా.." అంటూ పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

AP Deputy CM Power Star Pawan Kalyan Request To Fans At Parwathipuram Manyam

"ఉత్తరాంధ్ర తెలుగు నేర్పించిన నేల.. వాడుక భాష నేర్పించిన నేల ఇది. తిరుగుబాటు నేర్పించిన నేల.. మనల్నీ దోపిడీ చేస్తే.. ఎదురు తిరిగిన నేల ఇది.. కానీ, మీరు సినిమా మోజులో పడి.. పోస్టర్లు పెట్టి.. ఓజీ..ఓజీ అనుకుంటూ హీరోలకు జేజేలు కొడితే ఎలా?' అని ప్రశ్నించారు. హీరోలకు జేజేలు కొట్టండి.. కానీ, మీ జీవితంపై దృష్టి పెట్టక.. బాధ్యతతో ఉండకపోతే.. జీవితంలో ముందుకు వెళ్లలేరు' అంటూ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు చురుకలు అంటించారు.

'మాట్లాడితే అన్నా మీసం తిప్పు.. మీసం తిప్పు.. అంటారు. నేను మీసం తిప్పితే .. రోడ్లు పడవు. నేను ఛాతి కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్లి ప్రధానికి దండం పెట్టుకుని.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తేనే.. మీకు రోడ్లుపడుతాయి. అప్పుడు మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతే కానీ.. మీసం తిప్పితేనో.. ఛాతీలు కొట్టుకుంటేనో.. పనులు జరగవు. అలాంటి నాకు చేతకావు. నాకు పని చేయడం మాత్రమే తెలుసు.. నా పనిని నన్ను చేసుకోనివ్వండి." అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు.

More from Filmibeat

Read more about: pawan kalyan tollywood power star
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X