అకీరాది పవన్ స్టైల్..సిగ్గు ఎందుకు, ఇచ్చిపడేసిన రేణూ దేశాయ్

మిగిలిన ప్రపంచంతో పోలిస్తే భారతీయుల వస్త్రధారణ డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఖాదీ దుస్తులను ధరించడం సాంప్రదాయంగా వస్తోంది. ఆడవాళ్లు చీరలు ధరిస్తుండగా.. మగవాళ్ల కోసం పంచె, ధోతి వంటి వాటిని మన పెద్దలు తీసుకొచ్చారు. ఇప్పుడంటే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో ధోతీలు కడుతున్నారు కానీ.. ఒకప్పుడు మగవాళ్లంతా ధోతి ధరించే బయటికి వచ్చేవారు. కొందరి కృషి కారణంగా నేటి కాలంలోనూ ధోతీలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.

ఇదిలాఉండగా.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ తన సినిమాలతో పాటు సమాజంలో నిత్యం జరుగుతున్న అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ఏ సబ్జెక్ట్‌పై అయినా ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. ఇక భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతో ఇష్టపడే రేణు.. తాజాగా మన వస్త్రధారణపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత పిల్లలే ప్రపంచంగా బతుకుతున్నారు రేణు దేశాయ్. అలాగే పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా సేవలందిస్తున్నారు. తనకు తోచినంత సాయం చేయడంతో పాటు , ప్రజలు కూడా మారేలా అవగాహన కల్పిస్తుంటారు రేణు.

AP Dy CM Pawan kalyan ex wife renu desai made sensational comments on akira nandan wearing dhoti

ప్రతి మాసంలోనూ వచ్చే పండుగలు, విశిష్ట దినాలను ఘనంగా జరుపుకుంటారు రేణు దేశాయ్ . గత నెలలో శరద్ పౌర్ణమి సందర్భంగా ఆమె తన నివాసంలో గణపతి చండీ హోమం నిర్వహించారు. అక్కడితో వదిలేస్తే ఏముంది.. పనిలో పనిగా పేరెంట్స్‌, సమాజానికి క్లాస్ తీసుకున్నారు రేణు దేశాయ్. భారతీయ సంస్కృతిలో శరద్ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉందని.. పెద్దలు అనుసరించిన విధానాలను పిల్లకు నేర్పించాలని ఆమె కోరారు. అలాగే ఈ చండీ హోమంలో తల్లితో పాటు అకీరా నందన్ కూడా పాల్గొన్నారు.

ఇకపోతే.. అకీరా నందన్ గడిచిన కొద్దిరోజులుగా తన తండ్రి పవన్ కళ్యాణ్‌కు తోడుగా ఉంటున్నారు. దాదాపు 6.4 హైట్‌తో అచ్చు గుద్దినట్లు పవన్ కళ్యాణ్‌లా ఉండే అకీరా నందన్‌లో హీరోకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉండటంతో అతను ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా అని మెగా, పవన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. తన తండ్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అకీరా తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి ఎరుపు రంగు చొక్కా, పంచెకట్టులో వచ్చి అందరినీ ఆకర్షించారు.

కాగా.. ఎవరైనా తన బిడ్డల జోలికి వస్తే మాత్రం వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తారు రేణు దేశాయ్. ఇందులో ఎవరికీ ఏ అనుమానాలు అక్కర్లేదు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె భారతీయుల వస్త్రధారణ , ఖాదీ దుస్తుల గురించి కీలకవ్యాఖ్యలు చేశారు. పవన్ గతంలోనూ ఖాదీ బట్టలు ఎక్కువగా వేసుకునేవారని రేణు గుర్తుచేశారు. అకీరా కూడా లుంగీ, ధోతీలో కనిపిస్తాడని.. వాడిని నేను మరింత ప్రోత్సహిస్తానని ఆమె తెలిపారు. ఇందులో సిగ్గుపడేది ఏం లేదని.. ప్యాంట్స్ మన కల్చర్ కాదని ధోతి, లుంగిలే మన సంస్కృతి అని రేణు దేశాయ్ వెల్లడించారు. మన సంస్కృతిని ఓన్ చేసుకోవాలని.. ధోతి, లుంగీలు వేసుకోవడానికి సిగ్గుపడొద్దని ఆమె యువతరానికి పిలుపునిచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X