సర్జరీ కోసం సహాయం చేయండి.. చేయి చాపిన రేణుదేశాయ్..రిక్వెస్ట్ కు షాకింగ్ రెస్పాన్స్
రేణు దేశాయ్ .. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా, సినీనటిగా ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పవన్‌తో విడాకుల తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె ఎవరిపైనా ఆధారపడకుండా బతుకుతోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రేణు దేశాయ్.. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన సంగతులను పంచుకుంటూ ఉంటుంది. అలాగే దేశ కాలమాన పరిస్ధితులపైనా తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా ఏ విషయాన్నైనా ఓపెన్‌గా మాట్లాడటం రేణుకి అలవాటు.
విడిపోయారన్న మాటే గానీ.. పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్‌లు ఇప్పటికీ ఒకరిపట్ల ఒకరు అభిమానం చూపించుకుంటూ ఉంటారు. అయితే కొందరు పవన్ ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరి సత్సంబంధాలను చెడగొడుతూ ఉంటారు. ప్రతిసారి రేణు గడ్డిపెట్టినా ఏమాత్రం బుద్ధి తెచ్చుకోకుండా ఆమె చేత చీవాట్లు తినడానికి రెడీగా ఉంటారు. కొద్దిరోజుల క్రితం ఆమె ఓ పూజ చేసుకుంటుంటే.. వదినగారు మీరు అనవసరంగా అన్నయ్యని వదిలిపెట్టావని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. దానికి ఆమె నేనేమీ పవన్‌ను విడిచిపెట్టలేదని, ఆయనే తనను వదిలిపెట్టారని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

ఇటీవల అకీరా నందన్‌పై నెగిటివ్ కామెంట్స్ పెట్టిన ఓ వ్యక్తిపై రేణూ దేశాయ్ విరుచుకుపడ్డారు. అకీరా ఫేస్ నచ్చకుంటే, చూడకు.. నీకు సిగ్గు లేకుండా నా అకౌంట్‌ను ఫాలో అవుతూ, నా కొడుకు మీద కామెంట్స్ చేస్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా గురించి చెత్త వాగుడు వాగినా భరిస్తాను కానీ నా పిల్లల మీద నెగిటివ్ కామెంట్స్, ద్వేషాన్ని, విషాన్ని చిమ్మితే మాత్రం ఊరుకోనని రేణూ దేశాయ్ హెచ్చరించారు.
పవన్‌తో విడిపోయిన తర్వాత తనదైన లోకంలో ఉంటున్న రేణు.. పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా యాక్టీవ్‌గా ఉంటున్నారు. తనకు తోచినంత సాయం చేయడంతో పాటు , అభిమానులను కూడా విరాళాలు కోరుతూ జంతువుల శ్రేయస్సు కోసం శ్రమిస్తున్నారు. పర్యావరణం, మూగ జంతువుల సంరక్షణకు సంబంధించి సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు పెడుతూ రేణూ దేశాయ్ తన పెద్ద మనసు చాటుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఓ పెట్‌కు సర్జరీ చేయించాలని, ఇందుకోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా దాని ఆరోగ్య పరిస్థితిని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె ఓ పోస్ట్ పెట్టారు. కానీ దానికి స్పందించి కేవలం పది మంది మాత్రమే విరాళం ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా రేణూ దేశాయ్ మరో పోస్ట్‌లో వెల్లడించారు. తనకు దాదాపు 1.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారని కానీ కేవలం పది మంది మాత్రమే విరాళం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మందికి పెట్స్ అంటే ఇష్టం ఉండటంతో ఎక్కువ మంది స్పందిస్తారని ఊహించానని.. అలాంటి ఈ రెస్పాన్స్ అంచనా వేయలేదని రేణూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు ఆమె ఫాలోవర్స్‌పై మండిపడుతున్నారు. వారికి ఏమాత్రం మనసు లేదని, మూగ జీవాలపై జాలి లేదని రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











