భగవద్గీతలోని శ్లోకంతో రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్ .. ఎవరి గురించి?

ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నా.. తన సామాజిక సేవ, సోషల్ మీడియాలో పోస్టులతో ట్రెండింగ్‌లో ఉంటారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్. సామాజిక కోణంలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఆమె పెట్టే పోస్టులు ఆలోచించేలా ఉంటాయి. పౌరురాలిగా తన వంతు బాధ్యత నిర్వర్తిస్తానని రేణు దేశాయ్ పలుమార్లు తెలిపారు. తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది . ఈ వివరాల్లోకి వెళితే..

పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన పిల్లలే ప్రపంచంగా జీవిస్తున్నారు రేణు దేశాయ్. వారిని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేశారు. అది కూడా మన ఆచారాలు , సాంప్రదాయాలను వారికి చిన్నప్పటి నుంచి నూరిపోశారు. అందుకే ఆద్య, అకీరా నందన్‌లు కూడా చాలా పద్ధతిగా పెరిగి అందరి చేత మన్ననలు అందుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరా నందన్‌ను ఇండస్ట్రీలోకి తీసుకురావాలని పవన్ అభిమానులు కోరుతున్నారు. ఇందుకోసం రేణు కూడా ప్లాన్ చేస్తున్నారు.

AP Dy CM Pawan kalyan ex wife renu desai shares bhagavad gita sloka in instagram

ఇప్పటికే యాక్టింగ్‌, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్న అకీరా నందన్‌‌లో ప్రొఫెషనల్ సంగీతకారుడు ఉన్నాడు. కొడుకుని అన్ని అంశాల్లో రాటుదేల్చారు రేణు దేశాయ్. ఎక్కడికి వెళ్లినా సాంప్రదాయ దుస్తులనే ధరించే అలవాటు చేశారు రేణు. యువత ఫ్యాషన్ పేరిట పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోకుండా మన దేశవాళీ చేనేత దుస్తుల్ని ధరించాలని ఆమె పలుమార్లు విజ్ఞప్తి చేశారు. తొలి నుంచి దైవభక్తి ఎక్కువ కావడంతో ప్రతి పండుగని ఘనంగా జరపడంతో పాటు పిల్లలను తీసుకుని పుణ్య క్షేత్రాలకు కూడా తిరుగుతుంటారు రేణు దేశాయ్.

Take a Poll

ప్రకృతి ప్రేమికురాలిగా, జంతు సంరక్షణలోనూ రేణు దేశాయ్ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. గతేడాది తన ఎన్జీవో సంస్థ రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో పాటు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో తన కార్యక్రమాల్లో దూకుడు పెంచారు. మూగ జీవాల సంక్షేమం కోసం రేణూ దేశాయ్ తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. తనకు తోచిన సాయం చేయడంతో పాటు ఆన్‌లైన్‌లోనూ మూగజీవాల సంరక్షణ కోసం విరాళాలను అభ్యర్ధిస్తుంటారు రేణూ దేశాయ్. కొద్దిరోజుల క్రితం రేణు దేశాయ్ ఎన్జీవో సంస్థకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని అంబులెన్స్‌ను సమకూర్చిన సంగతి తెలిసిందే .

రేణూ దేశాయ్‌ సినిమాలకు దాదాపుగా దూరమయ్యారు. జానీలో నటించిన దాదాపు 20 ఏళ్ల తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కనిపించిన ఆమె ఆ తర్వాత కొత్తగా ఏ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ వెండితెరపై రేణు దేశాయ్‌ని చూడాలని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. పలు ఇంటర్వ్యూలు సహా ఎన్నోసార్లు మీడియా ప్రతినిధులు రేణు దేశాయ్‌ రీ ఎంట్రీ గురించి ప్రశ్నించగా.. ఆమె నవ్వుతూ తప్పించుకున్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను పంచుకోవడంతో పాటు పలు అంశాలపై చర్చిస్తూ ఉంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే శ్లోకాన్ని పంచుకున్న రేణు దేశాయ్.. ప్రయత్నం మాత్రమే నువ్వు చేయాలని, ఫలితం గురించి ఆలోచించొద్దని చెబుతున్నారు. అయితే ఈ శ్లోకాన్ని రేణు దేశాయ్ ఎవరి కోసం? ఎందుకు పోస్ట్ చేశారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X