రేణు దేశాయ్‌కి సర్జరీ .. పవన్ కళ్యాణ్ మాజీ భార్యకి ఏమైంది? అభిమానుల్లో ఆందోళన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఆమె ఏం చేసినా, ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతూనే ఉంది. మీడియాకు దూరంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పటికీ రేణు దేశాయ్‌ని మీడియా మాత్రం వదలడం లేదు. ఏమీ లేకపోయినప్పటికీ గాలి వార్తలు సృష్టించి వదులుతున్నారు. పలుమార్లు లేనిపోని గాసిప్స్ తన పేరుతో చక్కర్లు కొట్టడంతో రేణు దేశాయ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కెరీర్ త్యాగం చేసిన రేణు దేశాయ్
జానీ, బద్రీ సినిమాలతో తెలుగువారిని పలకరించిన రేణు దేశాయ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో డేటింగ్, పెళ్లి కారణంగా సినిమాలకు దూరమయ్యారు. ఇద్దరు పిల్లలకు తల్లి కావడంతో వారి బాధ్యత చూసుకుంటూ ముఖానికి మేకప్ వేసుకోలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకుని సొంతూరికి వెళ్లిపోయారు రేణు దేశాయ్. పిల్లలు ఆద్య, అకీరా నందన్‌లే లోకంగా బతుకుతున్నారు. పలువురు టాలీవుడ్ దర్శకులు ఆమెను తిరిగి సినిమాల్లో నటింపజేయాలని భావించి ప్రయత్నించారు. కానీ ఎవరు ఎంతగా చెప్పినా? భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా వదిలేసుకున్నారు.

20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ
తొలుత పవన్ కళ్యాణ్ భార్యగా, తర్వాత తన పిల్లల కోసం రేణు దేశాయ్ తన సినీ కెరీర్‌ను త్యాగం చేశారు. అయితే పలువురి కృషి కారణంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం పాత్ర ద్వారా టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. తర్వాత మరే ప్రాజెక్ట్‌కు రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఒకవేళ రేణు దేశాయ్ కనుక సినిమాల్లో కంటిన్యూ చేసి ఉంటే ఖచ్చితంగా బిజీ అయ్యేవారని పవన్ అభిమానులు అంటూ ఉంటారు.
మూడో పెళ్లిపై క్లారిటీ
సినిమాలకు దూరమైనప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలలో బిజీగానే ఉంటున్నారు రేణు దేశాయ్. పర్యావరణ వేత్తగా, సామాజిక కార్యకర్తగా పాటు పడుతున్నారు. మూగజీవాల సంక్షేమం కోసం కృషి చేస్తోన్న ఆమె గతేడాది తన ఎన్జీవో సంస్థకు ప్రభుత్వం నుంచి అనుమతులు సంపాదించారు. మరోవైపు రేణు దేశాయ్ రెండో పెళ్లి ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్కే. పలుమార్లు ఆమె వీటికి చెక్ పెడుతూ వచ్చారు. అయితే రెండో పెళ్లి విషయంలో రేణు మనసు మారినట్లుగా వార్తలు వస్తున్నాయి. పిల్లల కోసం రెండో పెళ్లి వద్దు అనుకున్నానని.. కానీ ఇప్పుడు వాళ్లు అయ్యారని, తనను పెళ్లి చేసుకోమని ప్రోత్సహిస్తున్నారని రేణు తెలిపారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ఆమె హింట్ ఇచ్చారు.
రేణు దేశాయ్‌కి సర్జరీ జరిగిందా?
సోషల్ మీడియాలో తొలి నుంచి యాక్టీవ్‌గా ఉండే రేణు దేశాయ్.. తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన కుమార్తే ఆద్య కొణిదెలతో దిగిన ఫోటోను షేర్ చేసిన ఆమె.. సర్జరీ రత్వాత నా బిడ్డతో కలిసి డిన్నర్‌కి వెళ్తున్నానని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. రేణు దేశాయ్‌కి ఏమైంది? ఆమెకు సర్జరీ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్ట్‌పై రేణు దేశాయ్ క్లారిటీ ఇస్తేనే కానీ పవన్ అభిమానుల్లో టెన్షన్ తగ్గదు.


Click it and Unblock the Notifications











