పెద్దమనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. ఆ సీనియర్ నటికి ఆర్ధిక సాయం
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను హీరోగా, రాజకీయ నాయకుడిగా కంటే మనసున్న మనిషిగా జనం ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన వంతు సాయం చేసేందుకు ఆయన ఎప్పుడూ ముందుంటారు. గతంలో కామన్‌మెన్ ప్రొటెక్షన్ అయినా.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా ప్రజల కోసమే. ప్రకృతి విపత్తులు, ఇతర ఆపదల సమయంలో అందరి కంటే ముందు స్పందించేది ఆయనే. ఇలాంటి మనస్తత్వమే ఆయనను విభిన్నంగా నిలబెట్టింది.
సాయానికి ముందుండే పవన్ కళ్యాణ్
పదేళ్ల పోరాటం తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పలుమార్లు భారీ విరాళాలు అందజేశారు పవన్ కళ్యాణ్. అధికారంలోకి వచ్చిన కొత్తలో వరదలు, తుఫాన్లు కారణంగా దెబ్బతిన్న విజయవాడ నగరంతో పాటు ఏపీలోని 400 పంచాయతీలకు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల నంద్యాల జిల్లాలోని కొణిదెల గ్రామానికి రూ.50 లక్షలు ప్రకటించారు. తన ఇంటి పేరుతో ఉన్న ఈ గ్రామాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చిన మేరకు పవన్ ఈ విరాళం అందజేశారు.

ఏడాదిలో 20 కోట్లకు పైగా విరాళాలు
అలాగే తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు రూ.50 లక్షలను విరాళంగా అందజేశారు. తను ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలోని 325 మంది ఎలక్ట్రీషియన్లకు దాదాపు 16 లక్షల రూపాయల వ్యయంతో సేఫ్టీ కిట్లు అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.17 లక్షలతో పాటు పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన మధుసూదన్ కుటుంబానికి రూ.50 లక్షలు అందజేశారు. భారత్ - పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు రూ.25 లక్షలు పరిహారం ప్రకటించారు. మొత్తంగా గడిచిన ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ రూ.20 కోట్లకు పైగా విరాళాలు అందజేసి తన పెద్దమనసును చాటుకున్నారు.
కామెడీతో నవ్వించిన పాకీజా
ఇదిలాఉండగా.. లేడీ కమెడియన్‌గా డిఫరెంట్ డైలాగ్ డెలివరీ, మేనరిజమ్‌తో అప్పట్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు పాకీజా అలియాస్ వాసుకి. బ్రహ్మానందంతో కలిసి పలు చిత్రాల్లో నటించి హిట్ పెయిర్ అనిపించుకున్నారు. రౌడీగారి పెళ్లాం, మామగారు, పెదరాయుడు తదితర సినిమాలలో ఈ జోడీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే హఠాత్తుగా వెండితెర నుంచి మాయమైంది. తమిళంలో కొన్ని సినిమాలు, సీరియల్స్ చేస్తూ వచ్చింది. ఇటీవల ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకీజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకీజాను ఆదుకున్న పవన్
తాను ఆర్ధిక సమస్యలతో బాధపడుతున్నానని.. అవకాశాలు ఇచ్చేవారు ఎవరూ లేరని పాకీజా ఆవేదన వ్యక్తం చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను తనను ఆదుకోవాలంటూ కన్నీటి పర్యంతమైంది. రెండు సార్లు విజయవాడ వచ్చానని.. కానీ సీఎం, డిప్యూటీ సీఎంను కలవలేకపోయానని కన్నీటి పర్యంతమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆమెను మంగళవారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి పిలిపించి 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, పీ. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణలు కలిసి ఆమెకు అందజేశారు. తనకు సాయం చేసిన పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన పాకీజా భావోద్వేగానికి గురయ్యారు.


Click it and Unblock the Notifications











