కల్కి కోసం తల్లితో కలిసి ఐమాక్స్‌కు అకిరా నందన్.. ఫ్యాన్స్ చుట్టుముట్టడంతో ఏం చేశాడంటే?

పవర్‌స్టార్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ గడిచిన కొద్దిరోజులుగా వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి తండ్రికి అండగా నిలుస్తున్నాడు. డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అకీరా.. తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి ఎరుపు రంగు చొక్కా, పంచెకట్టులో వచ్చి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. మొన్నామధ్య తమ్ముడు రీ రిలీజ్‌ నేపథ్యంలో థియేటర్‌కు వచ్చిన అకీరాను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అకీరా నందన్‌పై ఫ్యాన్స్, పబ్లిక్ ఫోకస్ ఎక్కువగా ఉండటంతో ఆయను హీరోగా లాంచ్ చేసేందుకు ఇదే సరైన సమయమని అంటున్నారు.

దాదాపు 6.4 హైట్‌తో అచ్చు గుద్దినట్లు పవన్ కళ్యాణ్‌లా ఉండే అకీరా నందన్‌లో హీరోకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. అయితే ఈ కుర్రాడికి మ్యూజిక్‌పై బాగా ఇంట్రెస్ట్ ఉందని సన్నిహితులు చెబుతున్నారు. పియానోను అద్భుతంగా ప్లే చేయగల అకీరా నందన్ .. తన స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ పాటను పియానోపై ప్లే చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పటికే హీరోకు కావాల్సిన అన్ని రకాల ట్రైనింగ్ సెషన్స్‌ను జూనియర్ పవర్‌స్టార్ వేగంగా పూర్తి చేస్తున్నాడట. మంచి ముహూర్తం చూసి అకీరాను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

AP Dy CM Pawan Kalyan s son akira nandan watched kalki 2898 ad movie at prasads multiplex in hyderabad

కాగా.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమాపై ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయ పురాణాలకు సైన్స్ ఫిక్షన్‌ను జోడించి ఓ విజువల్ వండర్‌ను సెల్యూలాయిడ్ మీద ఆవిష్కరించారు నాగ్ అశ్విన్. నాలుగేళ్ల పాటు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కల్కిని తీర్చిదిద్దారు. హాలీవుడ్‌తో పాటు ఇతర విదేశీ చిత్రాలు చూస్తున్నప్పుడు భారతదేశంలో ఇలాంటి సినిమాలు తీయగలరా అన్న ప్రశ్నలు తలెత్తేవి. అయితే ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టడంతో పాటు అద్భుతంగా ఆచరించి చూపించారు నాగ్ అశ్విన్.

బుధవారం అర్ధరాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో స్పెషల్ షోలు ఉండటంతో థియేటర్లకు ప్రభాస్ అభిమానులు పోటెత్తారు. దీంతో సినిమాలోని కొన్ని సన్నివేశాలు .. ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పాజిటివ్ టాక్ వస్తుండటంతో రానున్న రోజుల్లో కల్కి కలెక్షన్ల సునామీ సృష్టించే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు సామాన్య ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రెటీలు కూడా కల్కి సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

అకీరా నందన్ కూడా కల్కి సినిమా చూడాలనుకున్నాడు.. అంతేకాదు ప్రభాస్ అభిమానులు ధరించే కల్కి టీ షర్ట్ ధరించి హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్సీకి వచ్చాడు. ఆయనను చూడగానే గుర్తుపట్టిన ఫ్యాన్స్ అకీరాను చుట్టుముట్టారు. దీంతో వారిని తట్టుకోలేకపోయిన ఆయన మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాకుండా పార్కింగ్ ఏరియా నుంచి థియేటర్‌ లోపలికి వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు అతనికి థ్యాంక్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అకీరాతో పాటు అతని తల్లి రేణు దేశాయ్ కూడా కల్కి 2898 ఏడీ సినిమాను వీక్షించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X