రామ్‌గోపాల్ వర్మకు బిగ్ షాక్.. 15 రోజుల డెడ్ లైన్..
Ram gopal Varma: సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. అది కాంట్రవర్సీగా మారుతుంది. ఆర్జీవీ కాంట్రవర్సీలతో స్నేహం చేస్తున్నాడా ? అని సందేహం కూడా రాకమానదు. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్ గోపాల్ వర్మ కు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమా నిబంధనలకు వ్యతిరేకంగా గత ప్రభుత్వం నుండి నిధులు పొందడంపై ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఆర్జీవికి నోటీసులు పంపించింది. వ్యూహం సినిమాకు తగినన్ని వ్యూస్ లేకపోయినా ఫైబర్ నెట్ నుండి కోటి 15 లక్షల రూపాయలను పొందినట్లు పేర్కొంది . ఈ మేరకు ఏపీ ఫైబర్ నెట్ ఆర్జీవి కి లీగల్ నోటీసులను జారీ చేసింది. ఈ క్రమంలో ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి ఆదేశాల మేరకు ఆర్జీవీతో సహా ఐదుగురికి నోటీసులను పంపించారు.

నిబంధనలకు వ్యతిరేకంగా లబ్ధి లబ్ధి పొందడం చట్ట విరుద్ధమని, 15 రోజులలో వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని ఆర్జీవికీ నోటీసులల్లో పేర్కొంది. వ్యూహం సినిమాకు వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా రాంగోపాల్ వర్మతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నారని జీవీ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో వ్యూహాం సినిమాకు కేవలం 1863 వ్యూస్ మాత్రమే ఉన్నాయని, ఈ లెక్కన ఒక్కొక్క వ్యూస్ కు 11వేల రూపాయలు చొప్పున చెల్లించారని వివరించారు. దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీసులను జారీ చేశారు.
ఈ సమయంలో ఏపీ ఫైబర్ నెట్ సంస్థ చెల్లింపుల పై ప్రస్తుత చైర్మన్ జీవి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలోని పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే కేబుల్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో .. 2016లో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ను ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో 2019లో 24 కిలోమీటర్ల మేర కేబుల్ వేసి 10 లక్షల కలెక్షన్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు.

అయితే వైసీపీ ప్రభుత్వం ఈ పథకంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ కలెక్షన్ల సంఖ్య 5 లక్షలకు పడిపోయిందని, ప్రస్తుతం ఆ సంస్థ దివాలా అంచుల్లో ఉందని వివరించారు. గత ప్రభుత్వ పనితీరే ఇందుకు కారణం అని, ఈ సంస్థలో పలు అవినీతి కార్యక్రమాలు జరిగాయని వీటిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని ప్రస్తుత చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు. అలాగే 2019లో 108 మంది ఉద్యోగులతో నెలకు 40 లక్షల ఖర్చుతో నడిపి, పది లక్షల కలెక్షన్లకు పెంచారని, కానీ.. వైసీపీ ప్రభుత్వ హాయంలో ఈ కార్యక్రమంలో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 10 లక్షలుగా ఉన్న కలెక్షన్లు 5 లక్షల పడిపోయాయని వివరించారు పైగా 1262 కోట్ల అప్పు చేశారని పేర్కొన్నారు..


Click it and Unblock the Notifications











