ఏపీలో షూటింగులకు అనుమతి.. నిర్మాతలకు సర్కారు తాయిలాలు ఇవే..
ఏపీలో సినిమా, టీవీ షూటింగ్ ప్రక్రియను సులభం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం నిర్ణయం తీసుకొన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమా టివి, థియేటర్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సింగిల్ విండో సిస్టం ఏర్పాటు చేసింది. గతంలో సంస్థ ఎండీ ఇచ్చిన సూచనల మేరకు 2006లో ఇచ్చిన జీవో ఎంఎస్2కు ప్రభుత్వం సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకొన్నది. సినీ నిర్మాణ ప్రోత్సహించేందుకు సినీ, టెలివిజన్ రంగాలకు ఉచితంగా షూటింగ్ అనుమతులిస్తూ తాజా ఉత్తర్వుల్లో ఆదేశాలు జారీ చేసింది.
షూటింగుల కోసం గతంలో నిర్ణయించిన ఫీజులను, కాషన్ డిపాజిట్లను కార్పొరేషన్‌కు చెల్లించి.. ఆ తర్వాత షూటింగ్ ముగిసిన వెంటనే వాటిని రీఫండ్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకొన్నది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ ఎండీ నిర్ణయం తీసుకొన్నారు.

ఏపీ ప్రభుత్వం సింగిల్ విండో విధానంలో కేటగిరి 1లో కాషన్ డిపాజిట్ కింద రూ.15వేలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ కేటగిరిలో రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉన్న పార్కుల్లో షూటింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అలాగే రాష్ట్రంలోని వివిధ మ్యూజియం, భవనాలులు,పాఠశాలలు కాలేజీలలో షూటింగ్ చేసుకోవడానికి సినీ నిర్మాతలకు వెసలుబాటు కల్పించింది.
ఇక కేటగిరి 2లో రోజుకు కాషన్ డిపాజిట్ రోజుకు రూ.10 వేలుగా నిర్ణయించింది. దీని ప్రకారం.. ఏపీలోని అన్ని ఆలయాలు, విశాఖపట్నం, తిరుపతి జూ పార్కులు, ఎపిటిడిసి ఆధ్వర్యంలో ఉన్న సరస్సులు, ఉద్యానవనాలు, జిల్లా కేంద్రాల్లోని పాఠశాలలు, కళాశాలలు, ,విజయవాడలోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలలో షూటింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
ఇక కేటగిరి 3 కింద కాషన్ డిపాజిట్‌ను రోజుకు 5 వేలుగా నిర్ణయించింది. మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని రోడ్లు, పార్కులు, బీచ్‌లు, అలిపిరి గార్డెన్స్‌తో సహా అన్ని పార్కుల్లో షూటింగులకు అనుమతులు మంజూరు చేసింది. అలాగే ఏపీటీడీసీ, ఆర్&బి, ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన లొకేషన్స్‌లో కూడా షూటింగ్లకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.


Click it and Unblock the Notifications











