twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై వైఎస్ జగన్ సర్కార్ కీలక నిర్ణయం..అలాంటి మోసాలకు చెక్?

    |

    ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ టికెట్ ధరల వ్యవహారం టాలీవుడ్ కి పెద్ద తలనొప్పిగా మారింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో మొదలైన ఈ ధరల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. చిరంజీవి బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిస్తే ఈ అంశం మీద ఒక క్లారిటీ రావచ్చని అందరూ భావిస్తూ ఉండగా అనుకోకుండా ఈ సమావేశం వాయిదా పడింది. అయితే ఈ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

    టిక్కెట్ రేట్ల టెన్షన్

    టిక్కెట్ రేట్ల టెన్షన్

    పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించడంతో ఆ డబ్బు వెనక్కు రాబట్టుకోవడానికి సినిమాని పెద్ద ఎత్తున విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన బెనిఫిట్, ప్రీమియర్ షోలకు భారీగా రేట్లు ఫిక్స్ చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.. అయితే రంగంలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వక పోవడమే కాక టికెట్ రేట్లు నిర్ణయిస్తూ ఒక జీవో జారీ చేసింది.

    ప్రాంతాల వారీగా రేట్లు

    ప్రాంతాల వారీగా రేట్లు

    గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లకు ఒక రేటు, పట్టణ ప్రాంతాల థియేటర్లకు ఒక రేటు, మల్టీప్లెక్స్ లకు ఒక రేటు ఇలా రకరకాల రేట్లు ఫిక్స్ చేస్తూ మరో జీవో జారీ చేసింది. నిర్మాతలు మొదలు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు ప్రభుత్వం చెప్పిన రేట్లకు థియేటర్ లలో సినిమాలు వేస్తే పూర్తిగా నష్టపోతామని దానికంటే థియేటర్లు మూసుకోవడమే నయం అని చెబుతున్నారు.

    ఈ నేపథ్యంలోనే పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం వైఎస్ జగన్ వద్దకు వెళ్లి తమ సమస్యలు అన్ని విన్నవించి టిక్కెట్ల రేట్లు పెంచే విషయం మీద కాస్త మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని భావించారు, చిరంజీవి ఆధ్వర్యంలో ఒక బృందం వెళ్లి కలిసి రావాలనుకున్నా అనూహ్యంగా ఆ సమావేశం క్యాన్సిల్ అయింది.

    అదే అనుమానం

    అదే అనుమానం

    అయితే తెలుగు పరిశ్రమ నుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. తెలుగు సినిమాల నుంచి పన్ను ఆదాయం 20 కోట్లకు మించడం లేదని, తెలుగు పరిశ్రమ పన్నులు తక్కువ చెల్లించి మోసం చేస్తున్నారని జగన్ భావిస్తున్నారని, వందల కోట్ల కలెక్షన్లు అంటూ ఊదరగొట్టే వారు కేవలం 20 కోట్లు పన్ను చెల్లించడం ఏమిటి అని విషయం మీద ఆయన అనుమానం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

    మోసం చేస్తున్నారనే భావనతోనే

    మోసం చేస్తున్నారనే భావనతోనే

    విషయం మీద దృష్టి పెట్టిన ఆయన ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చాక అప్పుడే టికెట్ ధరలపై తదుపరి చర్యలు తీసుకుంటారని ప్రచారం జరగగా ఇప్పుడు మరో విషయం తెర మీదకు వచ్చింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు మరియు మల్టీప్లెక్స్‌ల కోసం సినిమా టిక్కెట్ల కోసం ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తూ ఒక జీవో విడుదల చేసింది. నిజానికి ఆగస్టు 31నే ఈ జీవో విడుదలైనా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ పోర్టల్‌ను AP స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ మరియు థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుందని అంటున్నారు.

     పన్ను ఎగవేత కారణంగానే

    పన్ను ఎగవేత కారణంగానే

    ఈ పోర్టల్ ముఖ్యంగా B మరియు C కేంద్రాలలో పన్ను ఎగవేతను నియంత్రించడానికి అని అంటున్నారు. ఇక ఇప్పటిదాకా ఈ బీ, సీ కేంద్రాల కలెక్షన్లు లెక్కలోకి రావడం లేదని, అందువల్ల, వారు సంఖ్యలు మరియు ఆక్యుపెన్సీ తక్కువగా రిపోర్ట్ చేసి పన్ను ఎగవేస్తున్నారని అంటున్నారు. సినిమా బిజినెస్ లో పారదర్శకత తీసుకురావడానికి ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశం అని అంటున్నారు. జగన్ పన్నుల రూపంలో తక్కువ వస్తున్నాయి అని భావించడమే ఈ పోర్టల్ రూపకల్పనకు ముఖ్య కారణం అని అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబందించిన పనులు కూడా పూర్తి అయ్యాయని అంటున్నారు. ఇక్కడికే తెలంగాణలో కూడా ప్రభుత్వం ఒక పోర్టల్ తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

    Recommended Video

    Pawan Kalyan రాజ్యాన్ని ఏలడానికి 6 సూత్రాలు | Bheemla Nayak || Filmibeat Telugu
    ఇదే మొదటి స్టెప్పా

    ఇదే మొదటి స్టెప్పా

    టికెట్ రేట్ల గురించి ప్రతిష్టంభనను పరిష్కరించడంలో ఈ పోర్టల్ మొదటి ఉపశమనం కావచ్చని అంటున్నారు. ఇక మరో పక్క పరిశ్రమ పెద్దలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం గురించి ఇప్పటికీ సరయిన స్పష్టత లేదు. జగన్ మోహన్ రెడ్డి బిజీ బిజీ షెడ్యూల్స్ కారణంగా ఇది పదేపదే వాయిదా పడుతుంది.

    పెద్ద సినిమాలు కనీసం దసరాకు విడుదల చేయడానికి వీలు లేని విధంగా ఈ టికెట్ రేట్ల వ్యవహారంలో సందిగ్దత అయితే కొనసాగుతోంది. అయితే అసలు ఈ టికెట్ల విషయం మీద పరిస్థితులు, పరిణామాలు ఎంత దూరం వెళతాయి ? అసలు ఏం జరగబోతోంది అనే విషయం మీద మాత్రం పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. జగన్ తో టాలీవుడ్ పెద్దల భేటీ ఎప్పుడు జరగనుంది ? అనేది ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. చూడాలి ఏం జరగనుంది అనేది.

    English summary
    Andhra Pradesh Government has released a G.O. setting up an online booking portal for cinema tickets for all single screen theaters and Multiplexes in the state
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X