హమ్మయ్య .. సంక్రాంతి సినిమాలకు ఏపీలో టికెట్ ధరల పెంపు , ఏ మూవీకి ఎంతంటే?

తెలుగు వారికే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా సంక్రాంతి అతి పెద్ద పండుగ. ప్రపంచంలో ఏ మూలన , ఎంత బిజీగా ఉన్నప్పటికీ సంక్రాంతిని స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయుల మధ్య జరుపుకునేందుకు తెలుగు వారు తరలివస్తారు. ఆ సమయంలో అందరితో సరదాగా గడిపేందుకు సినిమాలకు వెళ్తుంటారు. ఆ సమయంలో ఎన్ని సినిమాలు రిలీజైనా ప్రజలు ఆదరిస్తారు. అందుకే దర్శక నిర్మాతలు కూడా సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ జనవరి 10న, బాలకృష్ణ - బాబీల డాకు మహారాజ్ జనవరి 12న , వెంకటేష్ - అనిల్ రావిపూడిల సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న భారీ ఎత్తున రిలీజ్ కానున్నాయి. పెరిగిన నిర్మాణ వ్యయం, ఖర్చులు నేపథ్యంలో పెద్ద సినిమాలు తొలి వారంలోనే పెట్టిన పెట్టుబడిన వెనక్కి తీసుకురావాలని తాపత్రయపడుతున్నాయి. ఏమాత్రం తేడా కొట్టినా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి.

ap govt gives permission to increase ticket prices for these movies

అందుకే బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటారు దర్శక నిర్మాతలు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌కు అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్‌లు చోటు చేసుకున్నాయో తర్వాతి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భగ్గుమన్నారు. తాను అధికారంలో ఉన్నంత కాలం టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని తేల్చిచెప్పారు. దీంతో నైజాం మార్కెట్‌లో తెలుగు సినిమాకు దెబ్బ పడనట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే దిక్కయ్యింది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్‌రాజు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం, సినీనటుడు పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.

దిల్‌రాజు ప్రయత్నాలు ఫలించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్ వినిపించింది. సినిమాల బడ్జెట్ తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకుని సినిమాల టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతించింది. తొలుత గేమ్ ఛేంజర్‌కు మొదటి వారం పాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.135 , మల్లిప్లెక్స్‌లో రూ. 175 మేర పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే పరిమిత స్థాయిలో బెనిఫిట్ షోలు ప్రదర్శించుకునేందుకు దీని ధరను రూ.600గానూ నిర్ణయించింది.

ap govt gives permission to increase ticket prices for these movies

ఇక డాకూ మహారాజ్ విషయానికి వస్తే ఈ సినిమాకు తొలి వారం సింగిల్ స్క్రీన్‌లలో రూ.110, మల్టీప్లెక్స్‌లలో రూ. 135, బెనిఫిట్ షోకు టికెట్ ధరను రూ. 500గా నిర్ణయించింది. విక్టరీ వెంకటేష్‌ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.75 , మల్టీప్లెక్స్‌లలో రూ, 100 చొప్పున పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. నైజాంలో సినిమాలకు దెబ్బపడినా.. ఏపీలో కొంతమేర లాభపడొచ్చని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X