Game Changer: దిల్ రాజు చర్చలు సఫలం.. గేమ్ ఛేంజర్ టిక్కెట్ రేట్ ఎంతో తెలిస్తే షాక్..!
Game Changer Ticket Rates: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చేసింది. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'. ఈ మూవీలో కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించగా.. అంజలి, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. భారీ బడ్జెట్ తో నిర్మాత దిల్‌రాజు ఈ మూవీని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం గేమ్ చేంజర్ మూవీ మేకర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరల పెంపుతో పాటు, బెనిఫిట్ షోలకూ అనుమతి ఇచ్చింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదల కానుంది. ఈ మూవీకి తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. అలాగే.. అమెరికాలో సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది చిత్ర యూనిట్. నేడు గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో శనివారం సాయంత్రం జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

ఈనేపథ్యంలో గేమ్ ఛేంజర్ కోసం టిక్కెట్ల పెంపుతో ప్రత్యేక ప్రీమియర్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ప్రత్యేక GO విడుదల చేసింది. జనవరి 10వ తేదీ తెల్లవారుజామున 1 గంటలకు గేమ్ ఛేంజర్ ప్రత్యేక ప్రీమియర్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అలాగే.. ఈ ప్రీమియర్ షో టిక్కెట్ ధర రూ.600 గా నిర్ణయించింది. మల్టీప్లెక్స్‌లలో రూ.175, సింగిల్ స్క్రీన్‌లలో రూ.135 పెంపుతో జనవరి 10న ఆరు షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. జనవరి 11 నుండి ఆంధ్ర ప్రదేశ్ అంతటా ఐదు షోలు ప్రదర్శించబడతాయి. జనవరి 23 వరకు టిక్కెట్ల పెంపునకు అవకాశం కల్పించారు. దీంతో పవన్ కళ్యాణ్ - నిర్మాత దిల్ రాజు భేటీ సఫలమైందని కామెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్.


Click it and Unblock the Notifications











