Devara: ఎన్టీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు.. దేవర సినిమా కలెక్షన్లపై ప్రభావం

గతంలో కంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి. అలా వచ్చిన వాటికి దేశ వ్యాప్తంగా మంచి హైప్ కూడా లభిస్తోంది. అందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' (Devara) మూవీ ఒకటి. ఈ సినిమా కొద్ది రోజులుగా నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఫలితంగా ఈ చిత్రం పేరు మారుమ్రోగిపోతోంది.

పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల తెరకెక్కించిన సినిమానే 'దేవర'. హై రేంజ్ యాక్షన్‌తో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రాన్ని అదిరిపోయే రీతిలో ప్రమోట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

AP High Court Orders to Change Jr NTR Starrer Devara Movie Ticket Rates GO

'దేవర' మూవీని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లను కూడా నిర్వహించారు. ఇక, ఈ సినిమా టికెట్ రేట్లకు సింగిల్ స్క్రీన్స్‌లో 100, మ‌ల్టీప్లెక్స్‌లో 60 వ‌ర‌కు పెంచుకునే వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పించిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో 'దేవర' సినిమాకు టికెట్ రేట్లను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటీషన్ నమోదు అయిన సంగతి తెలిసిందే. టికెట్ రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని పిటీషనర్లు కోరారు. అంతేకాదు, ఏ ప్రాతిపదికన టికెట్ల పెంపుకు అవకాశం ఇచ్చారో చెప్పాలంటూ అందులో డిమాండ్ చేశారు.

'దేవర' సినిమా టికెట్ రేట్ల తగ్గింపుపై నమోదైన పిటీషన్‌పై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చిత్ర యూనిట్‌కు షాకిచ్చింది. పద్నాలుగు రోజుల పాటు టికెట్స్ ధరలని పెంచుకోవచ్చు అని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ.. న్యాయస్థానం 10 రోజులకు కుదించింది. ఇది సినిమా కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.

AP High Court Orders to Change Jr NTR Starrer Devara Movie Ticket Rates GO

ఇదిలా ఉండగా.. 'దేవర' సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. ఇందులో శ్రీకాంత్, చాకోలు కీలక పాత్రల్లో నటించారు. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందించాడు.

More from Filmibeat

Read more about: devara devara ticket rates jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X