స్మగ్లర్లు హీరోలా .. ఏపీ హోంమంత్రి షాకింగ్ కామెంట్స్, ఆ స్టార్ హీరో గురించేనా?
ఓ 30 నుంచి 40 ఏళ్ల వెనక్కి వెళితే హీరో అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. మంచి డ్రెస్ సెన్స్ ఉండాలి, కుటుంబం కోసం త్యాగాలు చేయాలి, రాముడు మంచి బాలుడిలా ఉండాలి .. హీరో గారికి తెరపై ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉండేలా ఆ పాత్రలను తీర్చిదిద్దేవారు దర్శకులు. అయితే రాను రాను ఈ విధానంలో మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం హీరోని జులాయిలా, ఓ ఆకతాయిలా చూపిస్తున్నారు . రీసెంట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2లో హీరో పాత్ర తీరు తెన్నులపై ఎన్నో విమర్శలు వచ్చాయి.
స్వయంగా అల్లు అర్జున్ మేనమామ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం పుష్ప సినిమాలో హీరో క్యారెక్టర్‌పై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారు. ఏపీ అటవీ శాఖ మంత్రి హోదాలో ఇటీవల కర్ణాటకకు వెళ్లిన జనసేనానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు. ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలని.. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా కన్నడ మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప సినిమా గురించి ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారు.

ఒకప్పుడు సినిమాల్లో హీరోలంతా అడవులను కాపాడే పాత్రలను చేసేవారని.. కానీ ఇప్పుడు స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్‌లు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. స్టార్ హీరోలు ఇలాంటి పాత్రలు చేయడం వల్ల సమాజానికి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రీసెంట్‌గా సీనియర్ నటుడు , నటకిరిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా పుష్ప 2 గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
తన లేటెస్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్.. వాడెవడో చందనం దొంగ, వాడు హీరోనా... హీరోల మీనింగ్ మారిపోయిందని వ్యాఖ్యానించారు. తన అదృష్టం వల్ల దాదాపు 48 ఏళ్లుగా మన చుట్టూ ఉన్న క్యారెక్టర్సే వేసి డిఫరెంట్ హీరో అనిపించుకున్నానని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుడంతో ఆయన వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్‌ని నేను బిడ్డలా భావిస్తానని.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయి. బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆదివారం పాలకొల్లులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం కాలంలో డ్రగ్స్ తీసుకుంటనే, స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలను ఎంత జాగ్రత్తగా పెంచుతామో, మగపిల్లలను కూడా తల్లిదండ్రులు అలాగే పెంచాలని అనిత సూచించారు. సినిమాల నుంచి మంచి కంటే చెడునే ఎక్కువ తీసుకుంటున్నారని హోంమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











