తన పెళ్ళికి మెగాస్టార్‌ని ఆహ్వానించిన అఖిల ప్రియ!
ఏపీ పర్యాటక శాఖా మంత్రి భూమా అఖిల ప్రియ వివాహం ఈ నెల 29 న జరగబోతోంది. ఈ నేపథ్యంలో అఖిల ప్రియ ప్రముఖులందరిని ఆహ్వానిస్తోంది. తాజాగా అఖిల ప్రియ మెగాస్టార్ చిరంజీవిని కలసి వివాహానికి రావలసిందిగా ఆహ్వానించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సామజిక మాధ్యమాలలో వైరల్ గా మారుతున్నాయి.
అఖిలప్రియతో కలసి సోదరి మౌనిక, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి, భూమా కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రజారాజ్యం పార్టీలో భూమా కుటుంబం ఉన్న సంగతి తెలిసిందే. ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అఖిల ప్రియ వివాహం జరగనుంది.

అఖిల ప్రియకు కాబోయే భర్త పారిశ్రామిక వేత్త భార్గవ్ రామ్. అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి మరణించిన తరువాత ఆమె తెలుగుదేశం పార్టీలో మంత్రి అయ్యారు.


Click it and Unblock the Notifications