బాలయ్య ఎన్నిరోజులు కష్టపడ్డారో తెలియదు.. ఎన్టీఆర్ బయోపిక్‌పై పరిటాల సునీత!
నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో బాలయ్య నటన, దర్శకుడు క్రిష్ ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించాడని సినీప్రముఖులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజకీయ ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని చూస్తున్నారు. ఏపీ మంత్రి పరిటాల సునీత నేడు ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని వీక్షించారు.
సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. యువత మొత్తం చూడాల్సిన చిత్రం ఇది. ప్రతి ఒక్కరూ తమ వృత్తి పట్ల ఎంత అంకిత భావం కలిగి ఉండాలో చెప్పే చిత్రం ఇది అని ఆమె అన్నారు. బాలకృష్ణ ఈ చిత్రం కోసం ఎన్నిరోజులు కష్టపడ్డారో తెలియదు కానీ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. సినీరంగంలో పెద్దాయన ఎన్టీఆర్ కష్టపడి ఎదిగిన వైనాన్ని బాగా చూపించారని అన్నారు.

ఎన్టీఆర్ ఎలా వ్యవహరించేవారో, హావభావాలు ఎలా ఉండేవో బాలయ్య కూడా అచ్చు అలాగే నటించారని సునీత అన్నారు. పరిటాల సునీత భర్త పరిటాల రవి ఎన్టీఆర్ కు చాలా సన్నిహితంగా ఉండేవారు. పరిటాల సునీత మాత్రమే కాక తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది నేతలు ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని వీక్షించారు.


Click it and Unblock the Notifications











