twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pawan వ్యాఖ్యలకు, ఇండస్ట్రీకి సంబంధం లేదు.. చిరు ఫోన్ చేసి అలా.. ఏపీ మంత్రి సంచలనం!

    |

    సినీ పరిశ్రమ సమస్యల గురించి చర్చించేందుకు ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు కలకలం రేపడంతో మళ్ళీ తెలుగు సినిమా పరిశ్రమ - ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మధ్య దూరం పెరుగున్నట్టు అంచనాలు వెలువడుతున్న క్రమంలో సినీ నిర్మాతలు చొరవ చూపి మంత్రి పేర్ని నానిని కలవడానికి ఆయన సొంత ఊరైన మచిలీ పట్నం వెళ్ళారు. ఈ భేటీ అనంతరం పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    నన్ను కలవలన్నారు

    నన్ను కలవలన్నారు

    ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలో బుధవారం తెలుగు సినీ నిర్మాతలతో సమావేశం ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాతూ.. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్‌లైన్‌ టికెటింగ్‌కు అనుకూలంగా ఉందని వెల్లడించారు. నన్ను కలవాలి అని నిర్మాతలు నిన్న అడిగారన్న నాని ఇండస్ట్రీ కి నష్టం జరిగే సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయని నాతో మాట్లాడాలి అన్నారని అన్నారు.

    సీఎంకు చెప్పండి

    సీఎంకు చెప్పండి

    ఇక భేటీలో ఇండస్ట్రీ అంతా ఒక్కమాటపై ఉన్నాము...ఇదే మాట సీఎంకు చెప్పండి అని కోరారని పేర్ని నాని కోరారు. ఇక ఆన్లైన్ టికెట్ల పై మేము అనుకూలం అని నిర్మాతలు చెప్పారన్న అయన ప్పటికే పోర్టల్స్ నుంచి ఆన్లైన్.లో టికెట్ల అమ్మకం జరుగుతుంది కొన్ని చోట్ల 90 శాతం ఆన్లైన్ లో అమ్ముతున్నారని అన్నారు. ఇక ప్రభుత్వం నిర్వహించిన గత మీటింగ్ పై అందరూ సంతృప్తి గా ఉన్నారని ఆయన అన్నారు.

    .పవన్ వ్యాఖ్యలకు సినిమా ఇండస్ట్రీ కి సంబంధం లేదు

    .పవన్ వ్యాఖ్యలకు సినిమా ఇండస్ట్రీ కి సంబంధం లేదు

    ఇక మాతో చెప్పకుండా ఒక నటుడు మాట్లాడారు అని నిర్మాతలు పవన్ ను ఉద్దేశించి అభిప్రాయ పడ్డారని అన్నారు. ఇక పవన్ వ్యాఖ్యలకు మేము అంతా బాధపడ్డాం....పవన్ వ్యాఖ్యలకు సినిమా ఇండస్ట్రీ కి సంబంధం లేదు అని నిర్మాతలు చెప్పారని, పవన్ వ్యాఖ్యలపై భేటీ లో విచారం వ్యక్తం చేశారని అన్నారు. ఇక ఆడియో ఫంక్షన్ లో జరిగిన పరిణామాలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి కూడా చెప్పారని ఆయన అన్నారు. ఇండస్ట్రీ బ్రతికించేందుకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు , సలహాలు పాటించేందుకు సిద్ధమని నిర్మాతలు చెప్పారన్న నాని పవన్ కల్యాణ్ కు వాళ్ల అమ్మగారు సంస్కారం నేర్పలేదా ? అని ప్రశ్నించారు. ఆ సన్నాసి నన్నేం తిట్టాడు ... నేను ఏం మాట్లాడాను ? అని ప్రశ్నించారు. నేను బూతులు తిట్టలేదు కాబట్టే టీవీలో నా ప్రెస్ మీట్ ప్రసారం చేశారని అన్నారు.

    అంజనాదేవి నేర్పించారా ?

    అంజనాదేవి నేర్పించారా ?


    ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరేయ్..ఉరేయ్ అని పిలవమని అంజనాదేవి నేర్పించారా ? అని ప్రశ్నించిన నాని నేను రెడ్లకు పాలేరునైతే ... పవన్ కమ్మవాళ్లకు పాలేరని అన్నారు. ఎస్ నేను జగన్ దగ్గర పాలేరునే... నీకు చెప్పే దమ్ముందా? అంటూ నాని ప్రశ్నించారు. నన్ను అవమానించాలని చూస్తే ... ఆ అవమానాన్ని పరిచయం చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో కిరాయికి రాజకీయ పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్ అని రాజకీయ పార్టీలకు టెంట్ హౌస్ పెట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు.

    Recommended Video

    Aishwarya Rajesh And Deva Katta Speaks About Republic Movie
    మమ్మల్ని దూరంగా ఉంచం

    మమ్మల్ని దూరంగా ఉంచం


    ఇక నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ చిరంజీవి , నాగార్జున , రాజమౌళితో కలిసి గతంలోనే సీఎంను కలిశామని, పరిశ్రమ పై కోవిడ్ ప్రభావం ... సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. వకీల్ సాబ్ సినిమా సమయంలో కొన్ని పరిణామాలు వేగంగా జరిగిపోయాయని, దయచేసి అందరూ వివాదాలకు మమ్మల్ని దూరంగా ఉంచండని కోరారు. గతంలో మా విజ్ఞప్తి పై ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందించిందని ఆయన అన్నారు. ఇక ఆన్ లైన్ విధానం కావాలని పరిశ్రమ తరపున మేమే ప్రభుత్వాన్ని కోరామన్న ఆయన ఆన్ లైన్ విధానం ద్వారా ట్రాన్సరెన్సీ ఉంటుందని అన్నారు.


    English summary
    Ap Minister perni nani responds on tickets issue and pawan kalyan comments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X