For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  PawanKalyan మీద నాని దారుణ వ్యాఖ్యలు.. ఎవరూ ఊహించని మాటలు అంటూ వకీల్ సాబ్ కలెక్షన్లు లీక్!!

  |

  రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలాగే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఉద్దేశిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా పవన్ వ్యాఖ్యల మీద మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ పవన్ మీద పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని ఏమన్నారంటే

   జగన్ పై విషం చిమ్మడానికి

  జగన్ పై విషం చిమ్మడానికి


  ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం సినిమా హాల్ లు మూయించిందని పవన్ కళ్యాణ్ అన్నారని అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సుమారు 1100 థియేటర్లకు గానూ 800 థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయి అన్నారు. అదే తెలంగాణలో 519 థియేటర్ లో ఉంటే 419 సినిమా హాళ్లు మూసి ఉన్నాయని పవన్ తెలుసుకోవాలని అన్నారు. పవన్ గొప్ప వ్యక్తిగా తనకు తాను ఊహించుకుంటూన్నారని మూడు రోజుల నుంచి ఏపీలోని 510 థియేటర్లలో లవ్ స్టొరీ సినిమా ఆడుతుందని అన్నారు. లవ్ స్టోరీ సినిమా ఏపీలో మొదటి రోజు 3కోట్ల 81 లక్షలు నిర్మాతకు వచ్చాయని, రెండవ రోజు నిర్మాత షేర్ 2 కోట్ల 80 లక్షల రూపాయలు వచ్చాయని తెలిపారు. జగన్ పై విషం చిమ్మడానికి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని.. దీనిపై లవ్ స్టోరీ నిర్మాత మాట్లాడాలని నాని కోరారు.

  మధ్యలోకి ఎందుకు లాగావ్

  మధ్యలోకి ఎందుకు లాగావ్

  సినిమా పరిశ్రమను సీఎం జగన్ ఎటువంటి ఇబ్బందులు పెట్టారో చెప్పాలన్న ఆయన నేను పవన్ ఒకే కులం, నేను సన్నాసి అయితే పవన్ కూడా సన్యాసేనని అన్నారు. మా వెధవన్నర వెధవ పవన్ ఏమి ఏమి మాట్లాడాడో అర్థం కావడం లేదని, సాయి ధరమ్ తేజ్ ప్రమాదాన్ని మధ్యలోకి ఎందుకు లాగావ్ అని ఆయన ప్రశ్నించారు. "పవన్, మేం అంతా ఒకటే, అంతా ఆ తానులో ముక్కలం. ఇవాళ సాయితేజ్ యాక్సిడెంట్ గురించి కూడా మాట్లాడాడు. మీడియాదే తప్పు అని మాట్లాడాడు. మీడియాకు బుద్ధి ఉందా అని అడిగాడు. ధైర్యం ఉందా అని మీడియాను కూడా అడిగాడు. మీడియాను కూడా సన్నాసుల్లారా అన్నాడు, మీడియాను తిట్టే ముందు రోడ్లు సరిగా లేవని కేసీయార్ ను ప్రశ్నించు అని ఆయన పవన్ కు సూచించారు.

  అంతా సొల్లు

  అంతా సొల్లు

  కేసిఆర్ పై నోరు తెరవాలి అంటే నువ్వు ప్యాంట్లు తడుపుకుంటావన్న ఆయన రిపబ్లిక్ ఇండియా అని పవన్ తెలుసుకోవాలని, రిపబ్లిక్ ఇండియా కాబట్టే నువ్వు ఏదైనా మాట్లాడకలుగుతున్నావని అన్నారు. పవన్ కళ్యాణ్ నా అభిమానన్న నాయిని నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులను, తెలంగాణ ముఖ్యమంత్రిని తిట్టాలని అన్నారు. అలాగే కోడి కత్తి దాడి కేసుపై ఎన్ఐఏ విచారణ చేస్తుందని పవన్ తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ కు దమ్ము ఉంటే కేంద్ర హోమ్ శాఖ మంత్రిని కలిసి కోడి కత్తి కేసు ఏమైందని ప్రశ్నించాలన్నారు. మేము సంపాదించుకుంటే మీకు పన్నులు, జిఎస్టీ ఎందుకు కట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదే అని ప్రశ్నించిన ఆయన మా ఎన్నికల్లో ఓట్ల కోసమే నీ తిప్పలు అని అందరికీ తెలుసని అన్నారు. సినీ నిర్మాతలకు ఏపీలోనే ఎక్కువ షేర్‌ వస్తుందని పేర్కొన్న నాని పవన్ కు కేంద్రంలో అసలు వేల్యూ లేదని.. అంతా సొల్లు చెబుతారని పేర్కొన్నారు.

  వ‌కీల్‌ సాబ్ కలెక్షన్లు

  వ‌కీల్‌ సాబ్ కలెక్షన్లు

  వ‌కీల్‌ సాబ్ సినిమాకు ఏపీలో వ‌చ్చిన ప్రొడ్యూస‌ర్ షేర్ రూ.50 కోట్లుపైనే. వ‌కీల్‌సాబ్ కు తెలంగాణ‌లో కంటే ఏపీలోనే ఎక్కువ షేర్ వ‌చ్చిందన్న పేర్నినాని వకీల్‌సాబ్‌ సినిమాకు దిల్‌రాజు షేర్‌ రూ.80కోట్లు. ఏపీలో రూ.55 కోట్లు, తెలంగాణలో రూ.25 కోట్లు వచ్చాయని అన్నారు. అలాగే దిల్ రాజు రెడ్డి అనాలని లేకుంటే మా వోడు ఫీల్ అవుతాడని అంటూ ఎద్దేవా చేశారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ కోసం 2003 నుంచి సినిమా ఇండస్ట్రీ అంతా చంద్రబాబు సహా వైఎస్‌ఆర్‌ను కలిసి కోరుతోందన్నా నాని 2020 జూన్‌లో కూడా సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి సహా సినీ ప్రముఖులు ఆన్‌లైన్‌ టికెటింగ్‌ పెట్టాలని కోరారని ఆయన అన్నారు. అసలు ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవహారంతో పవన్‌ కల్యాణ్ కు ఏం సంబంధం అని ప్రశ్నచిన ఆయన ఆన్‌లైన్‌ చేస్తే బ్లాక్‌ మార్కెటింగ్‌, పన్ను ఎగవేతలు తగ్గుతాయని, పారదర్శకత వస్తుందని సినీ ప్రముఖులు చెప్పారని అయితే ఆ ఆన్‌లైన్‌ అమ్మకాల విషయంలో ప్రభుత్వం పోర్టల్‌ ను మాత్రమే నడుపుతుందని అన్నారు.

  Daare Leda Team interview part 3. Real life doctor roopa Shares her life experiences In covid times
  అందుకే పెంచాం

  అందుకే పెంచాం

  ఆ టికెట్లను థియేటర్‌ యాజమాన్యాలే అమ్ముకుంటాయన్నా నాని వసూలైన డబ్బును మరుసటి రోజే నిబంధనల ప్రకారం ఎవరి డబ్బు వారికి రిజర్వ్ బ్యాంక్ ద్వారా పంపిణీ చేస్తామని అన్నారు. బ్లాక్‌ టికెట్లు అమ్మి నిర్మాతల ద్వారా నల్లధనం వసూళ్లు తెచ్చి తనకు కప్పం కట్టాలని పవన్‌ కల్యాణ్‌ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఇక మరో పక్క 2013లో టికెట్ రేట్లు సవరించాక మళ్ళీ సవరించలేదని అందుకే ఏపీ ప్రభుత్వం అప్పటి రేటు కంటే 40 శాతం టికెట్ల ధరలు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని అన్నారు. హీరో నాని, ఇతర హీరోలపై నీ కపట ప్రేమ ఏంటో మాకు తెలుసునని పేర్కొన్న నాని కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.

  English summary
  andhra pradesh minister perni nani made sensational comments on pawan kalyan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X