సీఎంతో ముగిసిన హీరోల భేటి.. వైఎస్ జగన్ కండిషన్స్ పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి.. ఏమన్నారంటే?

గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న టికెట్ల రేట్లపై సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక చాలాసార్లు సినీ ప్రముఖులు ఏపీ నేతలతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఎన్ని చర్చలు జరిపినా కూడా వర్కౌట్ కాలేదు. ఇక ఫైనల్ గా నేడు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి , కొరటాల శివ అలాగే మరికొందరు సినీ ప్రముఖులు కలిసి ఏపీ ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ఇక ఈ మీటింగ్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఈ విదంగా మాట్లాడారు. వివరాల్లోకి వెళితే..

Recommended Video

Tollywood Meets CM YS Jagan, 20 శాతం షూటింగ్ AP లోనే..!| Filmibeat Telugu
శుభం కార్డు పడినట్లే..

శుభం కార్డు పడినట్లే..

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమలో నెలకొన్నా టికెట్ల రేట్లు విషయంపై మేము ముఖ్యమంత్రితో కలిసి చర్చించడం జరిగింది. ఇక ఈ రోజుతో ఆ సమస్యకు శుభం కార్డు పడిందని మేము అనుకుంటున్నాము. ఇక ఈ సమావేశానికి తమకు అనుమతి ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. అని అన్నారు.

ఆలోచన మంచిదే..

ఆలోచన మంచిదే..

ముఖ్యంగా సీఎం గారు అతి తక్కువ ఖర్చు లోనే ప్రజలందరికీ వినోదం అందేలాగా నిర్ణయం తీసుకోవడం మంచి విషయమే. అలాగే సినిమా పరిశ్రమ కూడా నిలదొక్కుకునే విధంగా ఉండాలి కాబట్టి ఆయనతో చర్చలు జరిపాము. ఇక అందరికీ ఆమోదయోగ్యమైనవిగా ఉండేలాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజున మమ్మల్ని అందరినీ సంతృప్తి పరచింది. అందుకోసం సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.. అన్నారు.

చిన్న సినిమాల కోసం..

చిన్న సినిమాల కోసం..

అలాగే చిన్న సినిమాలు కూడా ఇండస్ట్రీలో చాలా ముఖ్యమైనవి అని అలాంటి సినిమాలు ఆడితేనే చాలామందికి కూడాఉపాధి లభిస్తుంది అనే ఆలోచనతో సీఎం గారు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో ఐదవ షోకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. దీని వల్ల చిన్న నిర్మాతలకు అందరికీ లాభం చేకూరుతుంది.. ఆ విషయంలో కూడా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము..అని తెలియజేశారు.

పెద్ద సినిమాలపై కూడా

పెద్ద సినిమాలపై కూడా

అలాగే ఈ రోజుల్లో భారతదేశం గర్వించదగ్గ సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా బడ్జెట్ సినిమాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. అలాంటి సినిమాలు ఎన్నో వస్తున్నాయి. ఆ సినిమాలకు కూడా వెసులుబాటు కలిగించేలా ప్రత్యేకమైన నిర్ణయాలను మరో కమిటీ ద్వారా చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలిపారు.

సంతృప్తికరంగా ఉన్నాం..

సంతృప్తికరంగా ఉన్నాం..

వారి నిర్ణయంపై మేము ఎంతో సంతృప్తికరంగా ఉన్నాం. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారు కూడా ఈ విషయంలో మొదటి నుంచి ముందుండి అన్ని విషయాలలో సమగ్రంగా చర్చలు జరుపుతూ వచ్చారు. అందుకోసం వారిని ప్రత్యేకంగా అభినందించి తీరాల్సిందే అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్ని నాని గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి మరొక మాట కూడా అన్నారు

ముఖ్యమంత్రి మరొక మాట కూడా అన్నారు

అలాగే ముఖ్యమంత్రి గారు మరొక మాట కూడా అన్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఎలాగైతే అభివృద్ధి చెందిందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే తరహాలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని వివరణ ఇచ్చారు. అందుకు కావలసిన వసతులను కూడా ప్రభుత్వం తరఫున అన్ని మద్దతుగాగా ఉంటాయని ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు. వైజాగ్ లో కూడా షూటింగ్ కి కావాల్సిన వాతావరణం ఉండేలాగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. కచ్చితంగా ఆ విషయంలో తమ వంతు కృషి చేస్తామని రెండు రాష్ట్రాల్లోనూ చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అంటే తెలుగువారిగా అంతకంటే గర్వకారణం మరొకటి ఏముంటుంది అందుకోసం చిత్ర పరిశ్రమ వైపు నుంచి పూర్తి మద్దతు.. ఉంటుంది అని మెగాస్టార్ అన్నారు.

 ఈ నెల మూడవ వారంలో కొత్త జీవో..

ఈ నెల మూడవ వారంలో కొత్త జీవో..

ఈరోజు సామరస్యంగా మంచి వాతావరణంలో చర్చలు జరిగాయి. అందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారికి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కమిటీ సభ్యులు కూడా న్యాయబద్ధంగా ఇచ్చిన ఫైనల్ నిర్ణయం కూడా చాలా బాగుంది. అందుకు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఫైనల్ గా ఈ నెల మూడవ వారంలో ఫైనల్ జివో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎంత త్వరగా జీవో వస్తే అంత త్వరగా చిత్రపరిశ్రమ ముందుకు వెళుతుంది.. అని మెగాస్టార్ చిరంజీవి తన వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X