ఎవరిని అడిగి అపరిచితుడు రీమేక్ చేస్తున్నారు.. డైరెక్టర్ శంకర్‌కు హెచ్చరిక.. ఆధారాలతో నిర్మాత నోటీసులు

సంచలన దర్శకుడు శంకర్ ఇటీవల ఒక కొత్త సినిమాపై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన కెరీర్ లో కల్ట్ మూవీగా నిలిచిన అపరిచితుడు సినిమాను బాలీవుడ్ లో మరింత కొత్తగా తెరకెక్కించబోతున్నట్లు చెప్పారు. అయితే ఆ సినిమా పనులు ఇంకా మొదలు కాకముందే ప్రముఖ నిర్మాత శంకర్ ను హెచ్చరించారు. చట్టపరమైన నోటీసులు పంపడానికి సిద్ధమయ్యారు. ఆయన ఒక అదారాన్ని కూడా బయటపెట్టడం విశేషం.

రోబో అనంతరం

రోబో అనంతరం

దేశం మెచ్చిన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న శంకర్ ఎలాంటి సినిమా చేసినా కూడా భాషతో సంబంధం లేకుండా ఆడియేన్స్ ను ఆకట్టుకుంటాయి. అయితే రోబో అనంతరం శంకర్ ఆలోచనా విధానం అంతగా సక్సెస్ అవ్వడం లేదు. 2.ఓ కూడా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.

సక్సెస్ లేకపోయినప్పటికీ

సక్సెస్ లేకపోయినప్పటికీ

ఒక విధంగా సక్సెస్ లేకపోయినప్పటికీ ఆయన తలచుకుంటే అద్భుతాలు సృష్టించగలరని కొంతమంది హీరోలు నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఇండియన్ 2 ఛాన్స్ దక్కింది. రామ్ చరణ్ తో ఒక సినిమాకు కమీట్ అయిన విషయం తెలిసిందే. ఇక రణ్ వీర్ సింగ్ తో మరో కొత్త తరహా అపరిచితుడిని చూపించే ఛాన్స్ కొట్టేశారు. ఆ సినిమాను బాలీవుడ్ నిర్మాత జయంతి లాల్ నిర్మించడానికి సిద్ధమయ్యారు.

అపరిచితుడు సర్వ హక్కులు నావే

అపరిచితుడు సర్వ హక్కులు నావే

అసలు మ్యాటర్ లోకి వస్తే అపరిచితుడు సినిమా సర్వ హక్కులు తనవే అంటూ సీనియర్ నిర్మాత V రవిచంద్రన్ నోటీసులు పంపేందుకు రెడీ అయ్యారు. 2005లో విడుదలైన అపరిచితుడు సినిమాను ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ లో రవిచంద్రన్ నిర్మించారు. రైటర్ సుజాత రాసిన ఆ కథ యొక్క పూర్తి హక్కులను తమ సంస్థ కొనుగోలు చేసినట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

 ఆధారాలు బయటపెట్టిన నిర్మాత

ఆధారాలు బయటపెట్టిన నిర్మాత

కథకు సంబంధించిన హక్కుల యొక్క ఆధారాలను కూడా నిర్మాత రవి చంద్రన్ మీడియాకు అందజేశారు. ఎవరిని అడిగి ఈ సినిమా ఆధారంగా మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటూ ప్రెస్ నోట్ ద్వారా వివరణ ఇచ్చారు. శంకర్ నిజాయితీ గల వ్యక్తి అంటూనే ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదని అన్నారు.

 రవిచంద్రన్ హెచ్చరిక

రవిచంద్రన్ హెచ్చరిక

బాయ్స్ సినిమా ప్లాప్ లో ఉన్నప్పుడు ఎంతగానో సపోర్ట్ చేసి అపరిచితుడు సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాంటిది ఆయన అన్ని మర్చిపోయి ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. ఇక సినిమాను వెంటనే ఆపేయ్యలని చెబుతూ చట్టపరమైన చర్యలకు సిద్ధం కావాలని రవిచంద్రన్ హెచ్చరించారు. ఎందుకంటే కథ యొక్క సర్వ హక్కులు తనవే అని వివరణ ఇచ్చిన రవిచంద్రన్ లీగల్ నోటీసులు అందుకోవడానికి రెడీగా ఉండండి అని వివరణ ఇచ్చారు.

Recommended Video

Karthi emotional words On Akkineni Nagarjuna | Sulthan Movie

aparichitudu producer plans to send legal notice on director shankar

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X