PVT04 వైష్ణవ్ తేజ్ మూవీలో మలయాళ స్టార్ హీరోయిన్.. వజ్ర కాళేశ్వరి దేవీ పాత్రలో పవర్‌ఫుల్‌గా

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి టాలెంటెడ్ యాక్టర్లు తెలుగు నటించి పేరు తెచ్చుకొన్న వారు చాలా మందే ఉన్నారు. వారిలో మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్నారు.అయితే ఇటీవల జోజు జార్జ్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

అదే దారలో మరో టాలెంటెడ్ యాక్టర్ అపర్ణా దాస్ తెలుగు సినిమాలో నటించేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న PVT04 చిత్రంలో ఆమె నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అపర్ణా దాస్ పాత్ర ఏమిటి? ఆమె గురించిన వివరాల్లోకి వెళితే..

Aparna Das entry Into Tollywood as Vajra Kaleshwari Devi in Panja Vaisshnavj Tejs PVT04

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఎస్ నాగవంశీ,ఎస్ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, జోజు జార్జ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈ చిత్రంలో అపర్ణా దాస్ వజ్ర కాళేశ్వరి దేవీ పాత్రను పోషిస్తున్నది.

అపర్ణా దాస్ ఇటీవల నటించిన దాదా చిత్రం ప్రేక్షకులనే కాకుండా సినీ విమర్శకులను మెప్పించింది. గతంలో ఆమె నటించిన న్జన్ ప్రకాశన్, మనోహరం, బీస్ట్ చిత్రాలు ఆమెకు పాపులారిటీని, దక్షిణాదిలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

Aparna Das entry Into Tollywood as Vajra Kaleshwari Devi in Panja Vaisshnavj Tejs PVT04

పంజా వైష్ణవ్ కెరీర్‌లో నాలుగో చిత్రంగా రూపొందుతున్న ఇంకా పేరు పెట్టని సినిమాలో వజ్ర కాళేశ్వరి దేవీ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకొన్నది. పంజా వైష్ణవ్ తేజ్ నటించిన PVT04 చిత్రం త్వరలో థియేటర్లలో రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ చిత్రంతో అపర్ణాదాస్ ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, అపర్ణా దాస్ తదితరులు
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్ రెడ్డి
నిర్మాతలు: ఎస్ నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
పీఆర్వో: వేణుగోపాల్, వంశీ కాక

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X