ప్రభాస్‌తో ఎఫైర్ .. నా పిల్లలపై ఒట్టు అంటూ నిజం బయటపెట్టిన వైఎస్ షర్మిల

సినీ రంగంలో ఉన్న వారిపై సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఫలానా హీరో , ఫలానా హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉందని.. వారిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోందని ఇలా రూమర్స్ తిరుగుతుంటాయి. అయితే రాజకీయాల్లో ఉన్న వారిపై సహజంగా అవినీతి ఆరోపణలు వస్తుంటాయి. అలాంటిది సినిమాకు రాజకీయానికి లింక్ చేస్తూ కొన్నేళ్లు ఓ గాసిప్ వైరల్ అవుతోంది. అది ఎవరి గురించో కాదు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఎవరు పుట్టించారో, ఎందుకు పుట్టించారో కానీ ప్రభాస్ - షర్మిల గురించి అసత్య ప్రచారం ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో దీనిపై సోషల్ మీడియాలో అసభ్యంగా కథనాలు వచ్చాయి. ప్రభాస్ , నయనతార జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన యోగి చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు అప్పటి కడప మేయర్, వైఎస్ షర్మిల మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి నిర్మాత. ఇక అప్పటి నుంచి ప్రభాస్‌కు షర్మిలకు మధ్య లేనిపోని సంబంధం అంటకట్టి అసభ్య కథనాలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై ప్రభాస్ ఎప్పుడూ ఖండించలేదు. కానీ షర్మిల మాత్రం కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌పై కోర్టులో కేసు వేసింది. దీంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయా వీడియోలను తొలగించారు.

apcc chief ys sharmila made sensational comments on her relationship with hero prabhas

ఏం జరిగిందో ఏమో కానీ వైఎస్ జగన్, వైఎస్ షర్మిలలు బద్ధ శత్రువుల్లా మారారు. అన్నను నేరుగా టార్గెట్ చేసిన షర్మిల పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నామధ్య ఏకంగా ఆస్తుల పంపకం కూడా తెరపైకి వచ్చింది. దీంతో స్వయంగా విజయమ్మ రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం భారత రాజకీయ, పారిశ్రామ వర్గాలను అదానీ వ్యవహారం కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూలో జగన్ పేరు కూడా తెరపైకి రావడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది.

ఈ ఇష్యూపై మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అదానీకి సంబంధించి ఈ ఒక్క విషయమే కాదు.. జగన్ చాలా డీల్స్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు క్రెడిబులిటీ లేదని, రాష్ట్రంలోనే కాకుండా అమెరికాలోనూ జగన్ అవినీతి ఏంటో తెలిసిందని షర్మిల వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే జగన్ తన లాభం కోసం తల్లిని, చెల్లిని వాడుకుంటున్నారని ఆరోపించారు. ఐదేళ్లు గాడిదలు కాసిన జగన్.. ఇప్పుడు చెల్లెలిపై ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని ప్రభాస్‌కూ, నాకు సంబంధం ఉందంటూ జరిగిన ప్రచారంపై నేను కేసు పెడితే ఎందుకు స్పందించలేదని షర్మిల ప్రశ్నించారు.

నా బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నా.. ప్రభాస్ ఎవరో నాకు ఇప్పటికీ తెలియదని, ఆయనతో తనకెలాంటి సంబంధం లేదని షర్మిల తేల్చిచెప్పారు. అన్నీ తెలిసి కూడా జగన్ తన సైతాన్ సైన్యంతో నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించారని, అసలు జగన్‌కు సిగ్గుందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరికి రాజకీయంగా లాభం పొందటానికి నా వీడియోనే వాడుకుంటున్నారని జగన్‌పై షర్మిల మండిపడ్డారు. మరి దీనిపై వైఎస్ జగన్, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: ys sharmila prabhas ys jagan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X