Sai Dharam Tej Health Bulletin: శుభవార్త చెప్పిన అపోలో వైద్యులు.. కానీ అప్పటి వరకూ ఐసీయూలోనే!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు శుక్రవారం రాత్రి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. తన స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తోన్న సమయంలో అతడు అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో శరీరంపై కొన్ని ప్రాంతాల్లో గాయలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మాదాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. రాత్రి నుంచి అక్కడి వైద్యులు సాయి ధరమ్ తేజ్‌కు చికిత్సను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఇక, ఇప్పుడు అతడికి చికిత్సను అందిస్తున్న డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అందులో ఏముందంటే!

Recommended Video

Sai Dharam Tej Helath Bulletin, డాక్టర్లు ఏమన్నారంటే..? || Filmibeat Telugu
బైక్ మీద నుంచి కింద పడడంతో

బైక్ మీద నుంచి కింద పడడంతో

శుక్రవారం రాత్రి సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి తన స్పోర్ట్స్ బైక్‌పై స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ గచ్చిబౌలీ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఐకియా దాటిన వెంటనే అతడు బైక్‌ నుంచి కిందపడిపోయారు. ఆ షాక్‌లో అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌కు పలు చోట్ల గాయాలయ్యాయి. అలాగే కాలర్‌ బోన్‌ కూడా విరిగిపోయింది.

అపోలో వైద్యులు ఏం చెప్పారు?

అపోలో వైద్యులు ఏం చెప్పారు?

ముందుగా సాయి ధరమ్ తేజ్‌ను మెడీకోవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడికి ప్రథమ చికిత్సను చేసిన తర్వాత కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అక్కడి వైద్యులు వెంటనే అతడికి చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలోనే సాయి తేజ్ ఆరోగ్యం బాగానే ఉందని, ముందు జాగ్రత్త చర్యగా 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు.

హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ

హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ

రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన సాయి ధరమ్ తేజ్ పరిస్థితి ఎలా ఉందోనని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలోనే అతడు త్వరగా కోలుకోవాలి అంటూ కోరుకుంటున్నారు. అలాగే, సినీ ప్రముఖులు సైతం అపోలో ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అపోలో ఆస్పత్రి వైద్యులు సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ వదిలారు.

శుభవార్త చెప్పిన అపోలో డాక్టర్స్

శుభవార్త చెప్పిన అపోలో డాక్టర్స్

సాయి ధరమ్ తేజ్‌కు నిన్న రాత్రి నుంచి చికిత్సను అందిస్తోన్న అపోలో వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇందులో 'సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. అతడి అవయవాలన్నీ చక్కగా పని చేస్తున్నాయి. వైద్యులు పర్యవేక్షిస్తూ సకాలంలో తగిన వైద్యం అందిస్తున్నారు' అంటూ పేర్కొన్నారు. దీంతో ఫ్యాన్స్ ఊపరి పీల్చుకుంటున్నారు.

అప్పటి వరకూ ఐసీయూలోనే

అప్పటి వరకూ ఐసీయూలోనే

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో అపోలో వైద్యులు కీలక విషయాలను వెల్లడించారు. 'సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం బాగానే ఉన్నా ఇప్పటికీ ఐసీయూలోనే ఉంచాం. క్లోజ్ అబ్జర్వేషన్ కోసం ఈరోజు మొత్తం అందులోనే ఉంచుతాం. మళ్లీ రేపు ఉదయం అతడి ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్‌ను విడుదల చేస్తాం' అని చెప్పారు.

ఫ్యాన్స్, ప్రముఖులు రావడంతో

ఫ్యాన్స్, ప్రముఖులు రావడంతో

సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ అయిన విషయం తెలియగానే ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులంతా ఆందోళనకు లోనయ్యారు. ఇక, ఇప్పుడు అతడు చికిత్స తీసుకుంటున్న అపోలో ఆస్పత్రికి వాళ్లంతా చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. ఇక, ఇప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేయడంతో కామ్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X