Ram Charan ఉపాసన డెలివరీకి ముందు.. తర్వాత ఏం జరిగిందంటే? వివరించిన అపోలో వైద్యులు
మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మంగళవారం (జూన్ 20 తేదీ) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మెగా ఇంటిలోకి చిన్నారి అడుగుపెట్టడం అభిమానులను, కుటుంబ సభ్యులను సంతోషానికి గురిచేసింది. అపోలో హాస్పిటల్‌లోని వైద్యులు సుమనా మనోహర్, రూమా సిన్హా, లతా కంచి పార్థసారథి.. ఉపాసన డెలివరీకి సంబంధించిన విషయాలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్బంగా సుమనా మనోహర్, రూమా సిన్హా, లతా కంచి పార్థసారథి మాట్లాడుతూ..
రాంచరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల ప్రసవం చాలా సురక్షితంగా జరిగింది. ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. జూన్ 20వ తేదీన ఉదయం ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి, ఉపాసన ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. చిన్నారి చాలా ఆరోగ్యవంతంగా ఉన్నారు. అతి త్వరలో తల్లి, బిడ్డ ఇద్దర్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తాం అని అపోలో డాక్టర్, గైనకాలజిస్ట్ సుమనా మనోహర్, రూమా సిన్హా, లతా కంచి పార్థసారథి తెలిపారు.
గర్బవతిగా ఉన్నప్పుడు ఉపాసన చాలా ఆరోగ్యంగా ఉంది. ఫిట్‌నెస్ పరంగా, అలాగే పోషకపదార్థాలు తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకొన్నారు. దాంతో ఆమె చాలా ఆరోగ్యంగా ఉండటంతో డెలివరీ సమయంలో ఎలాంటి సమస్యలు రాలేదు. దాదాపు బిడ్డకు జన్మనిచ్చే తల్లులు అందరూ అలానే ఉండాలని కోరుకొంటాం అని సుమనా మనోహర్, రూమా సిన్హా, లతా కంచి పార్థసారథి చెప్పారు.
రాంచరణ్, ఉపాసన దంపతులకు బ్యూటిఫుల్‌గా ఉన్న చిన్నారి పుట్టింది. చిన్నారి, తల్లి ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. వారి ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని రుమా సిన్హా తెలిపారు.

పీడియాట్రిషియన్ లతా కంచి పార్థసారథి మాట్లాడుతూ.. ఉపాసన కూతురు చాలా బాగుంది. ఆరోగ్యంగా ఉంది. పాప సంరక్షణను నేను చూసుకొంటున్నాను. ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు అని చెప్పారు.


Click it and Unblock the Notifications











