హాట్‌హాట్‌గా 'అప్పుడు-ఇప్పుడు'.. కేక పెట్టించిన ఫస్ట్ లుక్!

యు.కె.ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు సంయుక్తంగా నిర్మిస్తొన్న చిత్రం "అప్పుడు-ఇప్పుడు". చలపతి పువ్వల దర్శకుడు. సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా,శివాజీరాజా,'మళ్లీ రావా' ఫేమ్ పేరుపు రెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లొ కన్పించనున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతొన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. దసరా పండుగా సందర్భంగా 'అప్పుడు-ఇప్పుడు' ఫస్ట్ లుక్ ని విడుదలచేశారు.. ఈ సందర్భంగా

దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ - "మీ అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదలచేయడం హ్యాపీ గా ఉంది. మంచి కంటెంట్ తో వస్తోన్నఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. సుజన్, తనీష్క్ ఇద్దరు చాలా బాగా నటించారు. అందరూ కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మా నిర్మాతలు మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం మా సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. ఈ చిత్ర విజయం పై మా టీమ్ అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నాం" అన్నారు.

Appudu Ippudu first look released on Dasara

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ " విజయదశమి రోజున మా చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. మా దర్శకుడు చలపతి పువ్వల కొత్తవారైనా ఒక అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సినిమా కోసం ఎంతో ఇష్టంగా వర్క్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం" అన్నారు.

సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి ...
కెమెరా: కల్యాణ్ సమి,
ఆర్ట్: ఠాగూర్,
ఎడిటింగ్: వి.వి.ఎన్.వి.సురేష్ ,
సంగీతం: పద్మానావ్ భరద్వాజ్,
నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు,
దర్శకత్వం: చలపతి పువ్వల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X