సర్కార్... ఆ సీన్ తీసేప్పుడు నాతో పాటు అందరూ ఏడ్చారు: ఏఆర్ మురుగదాస్

తమిళ స్టార్ విజయ్ హీరోగా టాప్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన 'సర్కార్' మూవీ దీపావళి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో పలు హిట్ చిత్రాలు వచ్చిన నేపథ్యంలో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల ఓ తమిళ ఛానల్ ఇంటర్వ్యూలో మురుగదాస్ మాట్లాడుతూ... ఈ చిత్రంలోని ఓ ఎమోషనల్ సీన్స్ గురించి వెల్లడించారు. ఓ సీన్ చిత్రీకరించే సమయంంలో నాతో పాటు నలుగురైదుగురు క్రూ మెంబర్స్ కంటతడి పెట్టినట్లు తెలిపారు.

 రియల్ లైఫ్ సంఘటన

రియల్ లైఫ్ సంఘటన

అదొక ఎమోషనల్ సీన్. సినిమా విడుదల నేపథ్యంలో దాని గురించి నేను ఎక్కువగా ఇప్పుడే చెప్పలేను. అందులోని ఓ షాట్ ఇటీవల విడుదలైన టీజర్లో కూడా చూపించాం. ఈ సీన్ తిరునెల్వెల్లిలో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు ఆత్మాహుతి చేసుకున్న సంఘటన నుంచి ఇన్‌స్పైర్ తీశామని మురుగదాస్ తెలిపారు.

నేను కూడా ఏడ్చాను

నేను కూడా ఏడ్చాను

ఆ సీన్ చిత్రీకరించేపుడు అందరం ఎమోషనల్ అయ్యాం. నాతో పాటు నలుగురైదుగురు క్రూ మెంబర్స్ కంటతడి పెట్టుకున్నాం. ఎవరైనా మన కళ్ల ముందు కాలిపోతుంటే షాకవుతాం ఈ సీన్ సినిమాలో పెట్టడానికి ఒక ప్రత్యేక కారణముంది అని మురుగదాస్ తెలిపారు.

ఒకరి మొహం ఒకరం చూసుకోలేదు

ఒకరి మొహం ఒకరం చూసుకోలేదు

ఈ సీన్ చిత్రీకరించిన తర్వాత ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. అది ఎంతో బాధ కలిగించే సంఘటన. ఆ సీన్ తీసిన తర్వాత మా కళ్ల ముందు రియల్ లైఫ్ సంగటన మొదలాడుతూనే ఉంది అని మురుగదాస్ చెప్పుకొచ్చారు.

సర్కార్

సర్కార్

విజయ్, కీర్తీ సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కార్' మూవీ దీపావళి సందర్భంగా నవంబర్ 7న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X