సూపర్ స్టార్‌తో ఫ్యాంటసీ మూవీ.. ఫోన్ కోసం వెయిటింగ్ అంటున్న మురుగదాస్!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇదిలా ఉండగా సంక్రాంతికి రజని పెట్ట చిత్రంతో సందడి చేయబోతున్నారు. సూపర్ స్టార్ తదుపరి చిత్రాలపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఇటీవల సర్కార్ చిత్రంతో సంచలనం సృష్టించిన మురుగదాస్ తదుపరి చిత్రంలో రజనీకాంత్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మురుగదాస్ స్పందించారు.
నా తదుపరి చిత్రం రాజకీయాలపై ఉండదని మురుగదాస్ క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడూ ఒకేలా సినిమాలు చేస్తే బోర్ కొడుతుంది. అందుకే ఈ సారి రూట్ మార్చా అని మురుగదాస్ తెలిపారు. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలసి ఫ్యాంటసీ కథ వివరించా. ఆయనకు కథ చాలా బాగా నచ్చింది. ప్రస్తుతం రజని నుంచి ఫోన్ కోసం ఎదురుచూస్తున్నా అని మురుగదాస్ తెలిపారు.

ఈ చిత్రం ఖరారు కావాలనుంటే రజని నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని మురుగదాస్ అభిప్రాయపడ్డారు. కత్తి, తుపాకీ, సర్కార్ ఇలా వరుసగా సందేశాత్మక చిత్రాలు తెరకెక్కించిన మురుగదాస్ ఘనవిజయాలు సొంతం చేసుకున్నాడు.ఈ సారి కూడా సందేశాత్మక కథో, రాజకీయ కథో తెరకెక్కిస్తే జనాలు నా దర్శత్వం గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు అని మురుగదాస్ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











