సర్కార్‌లో మురుగదాస్ గెస్ట్ రోల్.. మళ్ళీ అదే సెంటిమెంట్!
విజయ్, మురుగదాస్ సూపర్ హిట్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ చిత్రం సర్కార్. కత్తి, తుపాకీ చిత్రాలు ఘన విజయం సాధించడంతో సర్కార్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మురుగదాస్ ప్రతి చిత్రంలో ఏదో ఒక సందేశాత్మక అంశం ఉంటుంది. బలమైన సన్నివేశాలతో తాను చెప్పాలనుకున్న అంశాన్ని ఆడియన్స్ కు మురుగదాస్ చేరవేస్తారు.
సర్కార్ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్స్ లో మురుగదాస్ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మురుగదాస్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను సర్కార్ లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు ధృవీకరించారు.

ఓ సాంగ్ లో భాగంగా మురుగదాస్ కనిపిస్తారట. విజయ్ తో కలసి మురుగదాస్ డాన్స్ చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందిస్తూ.. తాను విజయ్ తో కలసి డాన్స్ చేస్తానని అనుకోవడం లేదని మురుగదాస్ తెలిపారు. గతంలో కత్తి చిత్రంలో మురుగదాస్ తళుక్కున మెరిసిన సంగతి తెలిసిందే. సర్కార్ లో కూడా అదే సెంటిమెట్ ఫాలో అవుతున్నారు.


Click it and Unblock the Notifications











