August 16, 1947 ఇండిపెండెన్స్ నేపథ్యంగా.. ఏఆర్ మురగదాస్ నిర్మాతగా మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
భారత్ సాధించిన స్వాతంత్రం బ్యాక్ డ్రాప్‌గా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మించిన చిత్రం ఆగస్టు 16, 1947. ఈ చిత్రంలో గౌతమ్ కార్తీక్, నూతన నటి రేవతి, కమెడియన్ పుగజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించగా.. దక్షిణాదిలో సినీ అభిమానులను ఆకట్టుకొంటున్నది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
గ్రామీణ నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ కొత్త అనుభూతిని పంచేలా ఉంది. పేదరికంతో బాధపడే గ్రామస్తులు బ్రిటీష్ వారు ధరించే దుస్తులను వేసుకొని ఆనందంతో పరవశించిపోయారు అనే విషయం పోస్టర్‌లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా కనిపించింది. ఈ పోస్టర్‌పై ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించారు.

ఆగస్టు 16, 1947 చిత్రాన్ని ఓం ప్రకాశ్ భట్, నర్సిరామ్ చౌదరీతోపాటు ఏఆర్ మురగదాస్ నిర్మించారు. బ్రిటీష్ పాలనలో మగ్గిన ప్రజలు జీవన విధానం, అప్పటి స్థితిగతులు, స్వాతంత్రం సిద్దించిన తర్వాత వెలుగు చూసిన వారి ఆనందం నేపథ్యంగా పవర్ ప్యాక్డ్ సినిమాగా తెరకెక్కింది.
తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో ఆగస్టు 16, 1947 సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని కంటెంట్ ప్రతీ ఒక్కరిని భావోద్వేగానికి గురి చేయడమే కాకుండా.. కొత్త అనుభూతికి గురిచేస్తుందనే సినిమా యూనిట్ పక్కాగా నమ్మకంతో ఉంది.
నటీనటులు: గౌతమ్ కార్తీక్, రేవతి, పుగజ్ తదితరులు
దర్శకత్వం: ఎన్ఎస్ పొన్‌కుమార్
నిర్మాతలు: ఏఆర్ మురగదాస్, ఓం ప్రకాశ్ భట్, నర్సిరామ్ చౌదరీ
సహ నిర్మాత: ఆదిత్య జ్యోతి


Click it and Unblock the Notifications











