twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాధకరం.. మసకలి రీమిక్స్‌పై కామెంట్లు.. ఏఆర్ రెహ్మాన్ స్పందన ఇదే

    |

    బాలీవుడ్‌లో ఇటీవల రిలీజైన మసకలి 2.0 మ్యూజిక్ వీడియో వివాదంలో చిక్కుకుంది. సిద్ధార్థ మల్హోత్రా, తారా సుతారియా కలిసి ఈ వీడియోలో నటించారు. అయితే రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా రూపొందించిన ఢిల్లీ6 అనే సినిమా కోసం ఏఆర్ రహ్మాన్ ఈ పాటను స్వరపరిచిన విషయం తెలిసిందే. ఈ పాటను తనిష్క్ బగ్చి రీ మిక్స్ చేశారు.

    మసకలి పాటపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు, ప్రతికూల స్పందన రావడంతో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ట్విట్టర్‌లో స్పందించారు. ఎంజాయ్ ది ఒరిజినల్ అంటూ ట్వీట్ చేశారు. ఎంతో మంది నిరంతరం శ్రమిస్తే తప్ప అది రాబోయే తరాలు కూడా గుర్తుంచుకొనేంతగా విధంగా మ్యూజిక్ ఉంటుంది. దానికి షార్ట్ కట్స్ ఉండవంటూ ఓ సందేశాన్ని పోస్టు చేశారు.

    AR Rahman comments on Masakali 2.0

    ఇక ఢిల్లీ6 చిత్రంలో మసకలి పాటను రాసిన ప్రసూన్ జోషి బాధకరం అంటూ ట్వీట్ చేశారు. మసకలి చిత్రంలో అన్ని పాటలతోపాటు మసకలి పాటను కూడా రాశాను. ఒరిజినల్ పాటను ఎంత ఘోరంగా చేశారో వింటే చాలా బాధగా ఉంది అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ పాటపై పలువురు దారుణంగా మీమ్స్, ట్వీట్లు చేస్తుండటం గమనార్హం.

    English summary
    Music Director AR Rahman comments on Masakali 2.0. Rahman tweeted that No short cuts, properly commissioned, sleepless nights, writes and re-writes. Over 200 musicians, 365 days of creative brainstorming with the aim to produce music that can last generations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X