స్టార్ హీరో 58వ చిత్రం.. రంగంలోకి ఏఆర్ రెహ్మన్

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తన కదరామ్ కొండన్ చిత్రాన్ని ఓ పక్క విడుదలకు ముస్తాబు చేస్తూనే.. మరో పక్క తన 58వ సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం కోసం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మన్‌ను రంగంలోకి దించడం సెన్సేషనల్‌గా మారింది. ఈ విషయాన్ని అజయ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

విక్రమ్‌తో రూపొందించే సినిమా కోసం మ్యూజికల్ జీనియస్ ఏఆర్ రెహ్మన్‌తో జతకడుతున్నామని చెప్పడానికి తాను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని పేర్కొన్నారు. నా కల వాస్తవ రూపం దాల్చే రోజు వచ్చేసింది అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

AR Rahman ready for Chiyaan Vikrams 58th movie

గతంలో శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఐ సినిమా, అలాగే మణిరత్నం రూపొందించిన రావణన్ సినిమా కోసం విక్రమ్‌తో కలిసి ఏఆర్ రెహ్మన్ పనిచేశారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నది.

ఇక కదరామ్ కొండన్ చిత్రానికి రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కమల్ హసన్ నిర్మిస్తున్నారు. అక్షరహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రం జూలై 19న ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X