AR10: దగ్గుబాటి, నందమూరి హీరోలు కలిపిన అనిల్ రావిపూడి.. అదిరిపోయేలా సంక్రాంతికి మరో బిగ్‌ సర్‌ప్రైజ్

టాలీవుడ్‌లో తిరుగులేని కమర్షియల్ సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్, వరుస విజయాలతో దూసుకెళ్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). తన మార్కు కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా 2026 సంక్రాంతి బరిలో నిలిచిన అనిల్ రావిపూడి దర్శకత్వంలోని 'మనశంకర వరప్రసాద్ గారు' సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా, థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తూ భారీ వసూళ్ల వర్షం కురిపించింది.

చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమా ఏకంగా రూ. 375 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. థియేటరికల్ జర్నీ పూర్తి అయిన తరువాత.. ఓటీటీలో విడుదలైన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ సునామీ క్రియేట్ చేస్తుంది. ఇలా ఈ సినిమా రికార్డు స్థాయిలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి తరువాత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో భారీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు.

AR10 Announced Anil Ravipudi Unites Venkatesh and Kalyan Ram for Sankranthi 2027 Release

ఇప్పటికే తొమ్మిది వరుస బాక్సాఫీస్ హిట్లతో 'హిట్ మెషీన్'గా పేరొందిన ఆయన, తన తదుపరి సినిమాకి స్టార్ కాస్టింగ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. ఈసారి విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లను ఒకే తెరపైకి తీసుకువస్తున్నారు. అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబోకు ఇది ఐదో సినిమా కావడం విశేషం.

గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన F2, F3, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అంతేకాదు.. 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో వెంకటేష్ చేసిన ఎక్స్‌టెండెడ్ కామియో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇక కళ్యాణ్ రామ్‌తో 'పటాస్' తర్వాత మళ్లీ కలిసి పని చేయడం ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తెచ్చింది.

ఈ మల్టీ స్టారర్ తో రెండు ప్రముఖ కుటుంబాలైన దగ్గుబాటి, నందమూరి ఫ్యామిలీల హీరోలను ఒకే తెరపై చూపించడం ప్రత్యేకతంగా మారింది. అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు భావోద్వేగాలు, హాస్యం కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించనున్నట్టు టాక్. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సోర్టీని డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరుస్తూ దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. టెక్నికల్ టీమ్, హీరోయిన్‌లు, మ్యూజిక్ డైరెక్టర్ వంటి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

సంక్రాంతి సీజన్ అనిల్ రావిపూడికి లక్కీగా మారిన సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం పండగకు విడుదలైన ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. అందుకే ఈ సినిమాను సంక్రాంతి 2027కి గ్రాండ్ రిలీజ్‌గా ప్లాన్ చేశారు. 'సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి సినిమా తప్పనిసరి' అనే స్థాయికి ఈ కాంబినేషన్ చేరుకుంది. ఇక వెంకటేష్ - కళ్యాణ్ రామ్‌లతో అనిల్ రావిపూడి రూపొందించనున్న ఈ మల్టీస్టారర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తోందో వేచిచూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X