వెండితెరపై చరిత్ర సృష్టించిన టైటిల్.. మరోసారి ఆరాధన మూవీతో ముగ్గురు ప్రతిభావంతులు
సినిమా రంగంపై ఎనలేని ఆరాధన కలిగిన ముగ్గురు యువ ప్రతిభావంతులు తమ టాలెంట్‌ను పరిచయం చేసుకోవడానికి సిద్దం చెబుతున్నారు. ప్రేమలోని కొత్త కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తూ తాము రూపొందిస్తున్న చిత్రానికి ఆరాధన అనే ఆహ్లాదకరమైన పేరు పెట్టుకున్నారు. ఆ ప్రతిభావంతులు రవికిరణ్ (నిర్మాత), వశిష్ట పార్థసారధి (దర్శకుడు), పృథ్విరాజ్ (హీరో).

ఆర్ వి జీ మూవీస్‌తో కలిసి రెబెల్ నేషన్ నిర్మించనున్న విభిన్న ప్రేమకథా చిత్రం ఆరాధన. అతి త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నది. వశిష్ట పార్థసారధిని దర్శకుడిగా, పృథ్విరాజ్ పరిచయం అవుతున్నాడు. హీరోగా కీలక పాత్రనే కాకుండా నిర్మాతగా పరిచయమవుతూ రవికిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్‌తోపాటు ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్‌వీజీ) ఈ చిత్రానికి మరో నిర్మాత కావడం విశేషం! మధ్యప్రదేశ్‌లోని అత్యద్భుత లొకేషన్స్‌లో ఆరాధన చిత్రం అధికభాగం షూటింగ్ జరుపుకోనున్నది.
హీరో పృథ్విరాజ్ మీడియా నేపథ్యం నుంచి వస్తుండగా, ప్రొడ్యూసర్ రవికిరణ్ సాఫ్ట్‌వేర్ బ్యాక్ గ్రౌండ్ సినీ తెరకు పరిచయం అవుతున్నారు. దర్శకుడు వశిష్ట పార్థసారథి మై ఫ్రెండ్ గాంధీ అనే షార్ట్ ఫిల్మ్‌తో తన సత్తాను ఘనంగా ప్రకటించుకున్న ప్రతిభాశాలి కావడం గమనార్హం!
చిత్ర నిర్మాత, రెబెల్ నేషన్ అధినేత రవికిరణ్ మాట్లాడుతూ... సినిమా చూసిన ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా హృద్యమైన ప్రేమకథగా అభివర్ణించేంత గొప్పగా ఆరాధన చిత్రాన్ని తెరకెక్కించేందుకు మా దర్శకుడు వశిష్ట పార్థసారధి కృషి చేస్తున్నాడు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్ చిరంజీవి, రాజేష్ ఖన్నాల "ఆరాధనల" సరసన మా "ఆరాధన" సగర్వంగా నిలబడుతుందనే నమ్మకం మాకుంది" అన్నారు.
పిఆర్వో: ధీరజ్-అప్పాజీ
పాటలు: రెహమాన్
సంగీతం: హరి గౌర
ఛాయాగ్రహణం: వేణు కొత్తకోట
నిర్మాతలు: రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి), రవికిరణ్
రచన, దర్శకత్వం: వశిష్ట పార్థసారధి


Click it and Unblock the Notifications











