Arangetram ప్రేక్షకుడిని భయపెట్టించే సైకో థ్రిల్లర్.. పక్కా కమర్షియల్ మూవీగా.. రిలీజ్ ఎప్పుడంటే?
మహి మీడియా వర్క్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వంలో మహేశ్వరి కే నిర్మిస్తున్న చిత్రం ఆరంగేట్రం. రోషన్, ముస్తఫా ఆస్కరి, శ్రీనివాస్ ప్రభన్, పూజా, లయ నటిస్తున్న ఈ చిత్రం మే 5వ తేదీన భారీగా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్, అతిథులు ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ వేడుకకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
దర్శకుడు శ్రీనివాస్ ప్రభన్ మాట్లాడుతూ.. అరంగేట్రం పక్కా కమర్షియల్ మూవీ. సైకో థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలుగజేస్తుంది. క్రైమ్; ఫైట్స్, కామెడీ తదితర అంశాలతో రూపొందిన సినిమాలో ప్రతీ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. చిన్న సినిమా అయినప్పటికి మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా రిలీజ్ చేసే స్టామినా మాకు లేకపోయినా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. నిర్మాత మహేశ్వరి, సహ నిర్మాత విజయలక్ష్మీకి థ్యాంక్స్ అన్నారు.

నిర్మాత మహేశ్వరి కే, సహ నిర్మాత విజయలక్ష్మీ మాట్లాడుతూ... అరంగేట్రం సినిమా చాలా బాగా వచ్చింది. మే 5న థియేటర్స్‌లో మీ ముందుకు వస్తున్నాం. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం. ప్రేక్షకులపై నమ్మకంతోనే సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ప్రతీ ఒక్కరు ఆదరించాలని కోరుకొంటున్నాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ గిడియన్ కట్టా, ముస్తఫా, అనిరుధ్, రోషన్, ఇంకా నటీనటులు, టెక్నీషియన్స్ ఈ సినిమా విజయంపై ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

నటీనటులు: రోషన్ జెడ్, ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుధ్ టి, లయ, ఇందు, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, జబర్దస్త్ సత్తిపండు తదితరులు
రచన, డైలాగ్స్, దర్శత్వం: శ్రీనివాస్ ప్రభన్
నిర్మాత: మహేశ్వరి కే
బ్యానర్: మహి మీడియా వర్క్స్
మ్యూజిక్: గిడియాన్ కట్టా
సినిమాటోగ్రఫి: బురన్ షేక్ (సలీమ్)
ఎడిటర్: మధు
ప్రొడక్షన్ డిజైనర్: రమేష్ బాబు చిన్నం (గోపి)
కాస్ట్యూమ్స్: రాబాబ్ చి
స్టంట్స్: స్టార్ మల్లి
లిరిక్స్: సంజయ్ జీ
కొరియోగ్రఫి: అన్నా రాజ్
పీఆర్వో: నాగేశ్వరరావు (ఫ్రైడే పోస్టర్)


Click it and Unblock the Notifications











