తలైవి అప్‌డేట్ : ఎంజీర్‌గా అరవింద్ స్వామి.. ఆకట్టుకుంటోన్న లుక్

తమిళ రాజకీయ, సినీ రంగంలో చెరగని ముద్ర వేశాడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్). రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించి పదేళ్ల పాటు తమిళనాడును ఏలిన ఎంజీఆర్.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ఆయన మరణాంతరం ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని పూడ్చేందుకు అన్నాడీఎంకే పార్టీని నడిపేందుకు రంగంలోకి దిగింది జయలలిత. ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని తమిళ ప్రజలకు అమ్మగా మారింది జయలలిత. అయితే జయలలిత మరణం తరువాత మళ్లీ రాజకీయత శూన్యత ఏర్పడింది. అయితే తమిళనాట తనదైన ముద్ర వేసిన జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తలైవి అనే సినిమా తెరకెక్కుతోంది.

జయలలితగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఆ మధ్య తలైవి ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలింది చిత్రయూనిట్. దీనిలో భాగంగా జయలలిత తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన రోజుల నుంచి.. ముఖ్యమంత్రి తమిళ ప్రజల గుండెల్లో నిలిచిన ప్రయాణాన్ని చూపించబోతోన్నామని హింట్ వదిలినట్టు కనిపిస్తోంది. అయితే ఎంజీఆర్ గురించి చెప్పకుండా, ఎంజీఆర్ చరిత్ర లేకుండా జయలలిత జీవితం గురించి చెప్పడం కుదరదు.

Aravind Swamys MGR First From Kangana Thalaivi

నేడు ఎంజీఆర్ జయంతి సందర్భంగా.. ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి పోషిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్.. అచ్చం ఆయనను గుర్తుచేసేలానే ఉంది. ఈ పాత్రను పరిచయం చేస్తూ కాసేపటి క్రితమే ఓ టీజర్‌ను విడుదల చేశారు. అచ్చం ఎంజీఆర్‌ను చూస్తున్నామా? అనేట్టుగా అరవింద్ స్వామి జీవించేసినట్టు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X